విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారతదేశంలో తన వార్షిక ‘Back to School’ సేల్ ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో ఎంపిక చేసిన MacBook, iPad మోడళ్లపై స్టూడెంట్ డిస్కౌంట్లతో పాటు AirPods 4, Apple Pencil Pro, AirTags వంటి యాక్సెసరీలను కూడా ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 27, 2026 వరకు కొనసాగుతుంది. కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే విద్యాసంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బంది ఈ ఆఫర్లను పొందవచ్చు.
MacBook Air M5పై ప్రత్యేక ఆఫర్
M5 చిప్‌తో కూడిన MacBook Air (2026) విద్యార్థులకు రూ.1,37,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అదనంగా, AirPods 4 లేదా 4 AirTags ప్యాక్ వాటిలో ఏదో ఒకటి ఉచితంగా పొందవచ్చు. అలాగే, రూ.5,000 అదనంగా చెల్లించి AirPods 4 (ANC) పొందవచ్చు. రూ.13,000 చెల్లించి AirPods Pro 3కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. MacBook Pro M5 సిరీస్‌పై కూడా డిస్కౌంట్
విద్యార్థులకు MacBook Pro మోడళ్లు కూడా ప్రత్యేక ధరలకు లభిస్తున్నాయి.
MacBook Pro M5 (2025) – రూ.2,27,900
MacBook Pro M5 Pro (2026) – రూ.2,81,900
MacBook Pro M5 Max (2026) – రూ.4,62,900
ఈ మోడళ్ల కొనుగోలుపై కూడా AirPods 4 లేదా AirTags ప్యాక్ ఉచితంగా అందిస్తున్నారు. అదనపు చెల్లింపుతో AirPods 4 ANC లేదా AirPods Pro 3ను ఎంచుకోవచ్చు.
iPad Air, iPad Proపై ఆఫర్లు
iPad Air (2025) (M4 చిప్‌తో)
ప్రారంభ ధర: రూ.83,900
iPad Pro (2025)
ప్రారంభ ధర: రూ.1,27,900
ఈ రెండు మోడళ్ల కొనుగోలుపై Apple Pencil Proను ఉచితంగా అందిస్తున్నారు. అదనంగా వినియోగదారులు.. రూ.2,000కు AirTags ప్యాక్, రూ.2,000కు AirPods 4
రూ.7,000కు AirPods 4 (ANC), రూ.15,000కు AirPods Pro 3 వంటి ఎంపికలను కూడా పొందవచ్చు.
MacBook Neoపై రూ.10,000 తగ్గింపు
ఇటీవల ఆపిల్ విడుదల చేసిన MacBook Neo కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంది. 256GB స్టోరేజ్ మోడల్ – రూ.69,900, 512GB స్టోరేజ్ (Touch IDతో) – రూ.79,900. ఈ రెండు మోడళ్లపై రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. MacBook Neoలో Apple Silicon A18 Pro చిప్‌సెట్‌ను అందించారు.
విద్యార్థులకు మంచి అవకాశం
ఇటీవల MacBook, iPad మోడళ్ల ధరలను ఆపిల్ పెంచిన నేపథ్యంలో, ఈ Back to School Sale విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి అవకాశంగా మారింది. తక్కువ ధరలో లేటెస్ట్ Apple డివైస్‌ను కొనుగోలు చేయడంతో పాటు విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందే అవకాశం ఈ సేల్ ద్వారా లభిస్తోంది. ఆపిల్ ఎకోసిస్టమ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ సేల్ అత్యంత ప్రయోజనకరంగా ఉండనుంది.

