Site icon NTV Telugu

Motorola Edge 50 Fusion : మోటో నుంచి మరో స్మార్ట్ ఫోన్..ఫీచర్స్, ధర?

Motoo (2)

Motoo (2)

ప్రముఖ మొబైల్ కంపెనీ మోటో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..

మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ అనే మొబైల్ ను ఏప్రిల్ 3 న మార్కెట్ లోకి విడుదల చెయ్యబోతుంది..ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ విషయానికోస్తే.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని చెప్పబడింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ప్యాక్ చేయబడుతుంది. పాపులర్ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తుంది..స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌తో వస్తుందని చెప్పారు..

ఇక కెమెరా విషయానికొస్తే.. 50 మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పబడింది. అలాగే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ లో అందిస్తున్నారని. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుందని సమాచారం.. పీకాక్ పింక్, బల్లాడ్ బ్లూ మరియు టైడల్ టీల్ వేరియంట్లలో రాబోతుంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..

Exit mobile version