Site icon NTV Telugu

Amazon Great Republic Day Sale: లక్కీ ఛాన్స్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్.. మిస్సవ్వొద్దు గురూ..

Amazon Great Republic Day S

Amazon Great Republic Day S

Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2026 సేల్ ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద డిస్కౌంట్ సేల్. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వేరబుల్స్, కిచెన్ అప్లయన్సెస్, స్మార్ట్ టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు అనేక ఆఫర్‌లను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

READ MORE: Gold and Silver: రికార్డుస్థాయికి బంగారం, వెండి ధరలు.. పెట్టుబడులకు అనుకూల సమయమేనా..?

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం. యాపిల్, వన్‌ప్లస్, సామ్‌సంగ్, ఐక్యూ వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. తాజా మోడళ్లతో పాటు గత ఏడాది మోడళ్లను కూడా తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ విడుదలైనప్పుడు దాని ధర రూ.1,29,999 కాగా, తాజా సేల్‌లో రూ.1,19,999కే లభిస్తోంది. అలాగే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ.1,49,400 కాగా, అమెజాన్‌లో రూ.1,40,400కు అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 15, ఐక్యూOO 15 వంటి ఇతర హైఎండ్ ఫోన్లపైనా డిస్కౌంట్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డు లేదా EMI లావాదేవీలపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMIలు, కూపన్లు, అమెజాన్ పే ICICI కార్డు వినియోగదారులకు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే ఆ డిస్కౌంట్ ఫోన్ మోడల్, మీ ఫోన్ ప్రస్తుత కండీషన్‌ను బట్టి రేట్‌ను కేటాయిస్తారు. మొత్తంగా చూస్తే, కొత్త ఎలక్ట్రానిక్స్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మంచి అవకాశంగా నిలుస్తోంది. కొన్ని ఫోన్లకు సంబంధించిన రేట్లను కింది పట్టికలో చూద్దాం..

Exit mobile version