Budget Geysers: తక్కువ ధరకు సూపర్ వాటర్ హీటర్లు..! ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Geysers: కాలంతో పాటు మనుషులు కూడా మారుతుంటారు. ఎందుకంటే చలికాలంలో హీట్ వాటర్ లేకుండా స్నానం చేయాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ. మరీ ఇప్పుడు శీతాకాలం మొదలైంది. రాబోయే రోజుల్లో తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి మీ ఇంట్లో వాటర్ హీటర్ ఉందా. చలికాలంలో వేడి నీళ్లు లేకుండా స్నానం చేయగలిగే వాళ్లు చాలా అరుదు. వాస్తవానికి శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్టోరీలో చౌకైన గీజర్లు గురించి తెలుసుకుందాం.
READ ALSO: కేవలం రూ.9,999కే ఇంట్లోనే థియేటర్ సెట్.. కొత్త Portronics Beem 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్ లాంచ్..!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
కొన్ని సరసమైన గీజర్ ఎంపికలు..
యాక్టివా ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ గీజర్: యాక్టివా ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ గీజర్ అమెజాన్ ఇండియాలో కేవలం రూ.1,599 కు లభిస్తుంది. 3 KVA ఎలిమెంట్‌తో వస్తున్న ఈ గీజర్ ఇంట్లో ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. గీజర్‌తో వచ్చిన జాబితా చేసిన వివరాల ప్రకారం దానిని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ గీజర్ 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
GM ఫోగో నుంచి ఇన్‌స్టంట్ గీజర్ : GM ఫోగో బ్రాండ్ ఇన్‌స్టంట్ గీజర్‌ను అందిస్తుంది. దీని ధర అమెజాన్ ఇండియాలో రూ.2,199 గా ఉంది. ఇది 3-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది అధునాతన 3-స్థాయి భద్రతను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.
V-గార్డ్ ఇన్‌స్టంట్ గీజర్ : V-గార్డ్ ఇన్‌స్టంట్ గీజర్ అమెజాన్‌లో రూ.2,649 కు లభిస్తుంది. ఇది 3-లీటర్ సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ గీజర్ తెలుపు, నీలం రంగులలో లభిస్తుంది. దీనికి 2 సంవత్సరాల వారంటీ లభిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఓరియంట్ ఎలక్ట్రిక్ గీజర్: అమెజాన్‌లో ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇన్‌స్టంట్ గీజర్‌ను అందుబాటులో ఉంచింది. దీనిని ఓరియంట్ ఎలక్ట్రిక్ ఆరా రాపిడ్ ప్రో అని పిలుస్తారు. ఇది 5.9-లీటర్ సామర్థ్యంతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో 3000W హీటింగ్ ఎలిమెంట్‌ను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇంతకీ ఇన్‌స్టంట్ గీజర్‌లు అంటే ఏంటో తెలుసా.. ఇన్‌స్టంట్ గీజర్‌లు అంటే నీటిని తక్షణమే వేడి చేస్తాయి. అవి ఒక చిన్న ట్యాంక్, శక్తివంతమైన హీటింగ్ ఎలిమెంట్‌ను ఉపయోగిస్తాయి. ఇన్‌స్టంట్ గీజర్లు నీటిని తక్షణమే వేడి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?