Acer Ultra I Series FHD Smart LED Google TV: బడ్జెట్లలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే ఆలోచన ఉన్న వారికి ఏసర్ (Acer) కంపెనీ భారీ ఆఫర్ ను అందిస్తోంది. మరి ఆ టీవీ ఏంటి..? టీవీ పై ఆఫర్ ఏంటి..? ఆ టీవీ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా..
ఏసర్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ (acer Ultra I Series FHD Smart LED Google TV) ప్రస్తుతం భారీ ఆఫర్లతో వినియోగదారులజూ అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీని అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ టీవీ ధరకు మించిన అనుభూతిని అందిస్తుంది. ఇందులో 40 అంగుళాల (100 సెం.మీ) Full HD (1920×1080) డిస్‌ప్లేను అందించారు. ఫ్రేమ్‌లెస్ డిజైన్ వల్ల ఇది ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. A+ గ్రేడ్ VA ప్యానెల్, HDR10 సపోర్ట్, మైక్రో డిమ్మింగ్, సూపర్ బ్రైట్‌నెస్ టెక్నాలజీలతో విజువల్ మరింత స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తాయి. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల ఏ కోణం నుంచి చూసినా విజువల్ నాణ్యత తగ్గదు.
రగ్గడ్ లుక్, డిజిటల్ డిస్‌ప్లే, ప్రీమియం టచ్‌తో Mahindra Scorpio N Facelift
ఈ టీవీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. మాలి G31 MP2 గ్రాఫిక్స్ కో-ప్రాసెసర్‌తో వేగవంతమైన పనితీరును అందిస్తూ.. సినిమాలు, షోలు, కంటెంట్‌ను సూచించే పర్సనలైజ్డ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఆడియో పరంగా చూస్తే ఇది 30W అవుట్‌పుట్ ఇచ్చే హై-ఫిడిలిటీ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో వై-ఫై (Wi-Fi), బ్లూటూత్ (V5.2 వరకు), ఈథర్నెట్, రెండు USB పోర్ట్‌లు, HDMI పోర్ట్‌లతో ఇది పూర్తిస్థాయి కనెక్టివిటీని అందిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్న వాయిస్ రిమోట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోలకు వన్-క్లిక్ షార్ట్‌కట్ బటన్లు అందుబాటులో ఉన్నాయి. కళ్లపై ఒత్తిడి తగ్గించే ఐ కేర్ ప్రొటెక్ట్ ఫీచర్ ఉండటంతో పాటు, వీడియో కాలింగ్‌కు కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.
Municipal Elections Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!
ఈ టీవీ అసలు ధర (MRP) రూ.38,999 కాగా. ప్రస్తుతం దీనిపై ఏకంగా 65% భారీ తగ్గింపు లభిస్తోంది. దీంతో కేవలం టీవీ రూ.13,499కే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు వినియోగదారులకు మరికొన్ని ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు కేవలం రూ.475 నుంచి ప్రారంభమయ్యే నో కాస్ట్ EMI సౌకర్యం ఉండగా.. ఎంపిక చేసిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ.1,350 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
