Home
Zubeen Garg
Zubeen Garg News
-
Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై ఛార్జిషీట్ దాఖలు.. ఏముందంటే..!
సింగపూర్‌లో మృతిచెందిన గాయకుడు జుబీన్ గార్గ్ కేసులో అస్సాం పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. 3,500 పేజీల ఛార్జిషీటును సిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఏడుగురు నిందితులు కస్టడీలో ఉన్నట్లుగా పేర్కొంది. -
Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అసెంబ్లీలో సీఎం హిమంత కీలక ప్రకటన
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై ముఖ్యమంత్రి హిమంత శర్మ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్‌ది నేరపూరిత కుట్రగా తేల్చారు. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలియగానే లక్షలాది మంది అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఆకస్మిక మరణం పలు అనుమానాలకు దారి తీసింది. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై తలెత్తిన అనుమానాలే నిజమవుతున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి ముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా జుబీన్ గార్గ్ మంచి ఈతగాడు కూడా. అలాంటిది ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ మేనేజర్, నిర్వాహకుడిపై మర్డర్ కేసు నమోదు
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. -
Singer Zubeen Garg: నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం.. జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం సీఎం హెచ్చరిక
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సూచించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
జుబీన్ గార్గ్.. అస్సామీ గాయకుడు. అస్సామీ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది హృదయాలను గెలిచిన గాయకుడు. నిన్నామొన్నటిదాకా అంతగా పరిచయం లేని జుబీన్ గార్గ్. ఆయన మరణం తర్వాత.. ఆయన కోసం తరలివస్తున్న జనాలను చూస్తుంటే.. ప్రజల్లో గుండెల్లో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతోంది. -
Singer Zubeen Garg: ఆదివారం అస్సాం రానున్న సింగర్ జుబీన్ గార్గ్ భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. లైఫ్ జాకెట్ ధరించకపోవడంతో నీళ్లలో శవమై కనిపించారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..