వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భౌగోళిక మార్పులు ఆ ప్రజాప్రతినిధి పదవికి ఎసరు పెడుతున్నాయా? ఇరుకున పెట్టాలనే వైరివర్గం చక్రం తిప్పిందా? చివరిక్షణంలో మారిన పరిణామాలు దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరి పదవికి ముప్పు పొంచి ఉంది? హన్మకొండజిల్లాలో కలిసిన శాయంపేట.. ఇరకాటంలో గండ్ర జ్యోతి! గండ్ర జ్యోతి. వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై చర్చ ఎలా ఉన్నా.. ఆమె పరిస్థితిపై ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా…