ఓరుగల్లు టీఆర్ఎస్లో తూర్పు మంటలు రాజుకున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారా? ఏంటీ తాజా రగడ? ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పార్టీ నేతల ఫైర్..! వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీరు అధికారపార్టీ టీఆర్ఎస్‌లో సెగలు రేపుతోంది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోపై ఆయన చేసిన హడావిడి పార్టీలో చర్చగా మారడంతోపాటు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే వరకు వెళ్లింది.…