కోలివుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరో విశాల్ కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులను బాధిస్తోంది. పలువురు హీరోయిన్లతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని.. త్వరలోనే ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి జరగబోతోందని గతంలో ఎన్నో వార్తలు పుట్టుకోచ్చాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని సోషల్ మీడియాలో గాసిప్స్…