నెలకు కేవలం రూ.10 సబ్‌స్క్రిప్షన్ ఫీజుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘టిబిడి’ (త్రిభాణధారి) అధికారికంగా లాంచ్ అయింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ రూపొందించిన ఈ ఓటీటీ, భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ సంచలనం సృష్టించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన టిబిడి, ఇప్పుడు భారత్‌లో రూట్ లెవెల్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో లోగో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు…