శనివారం.. వేంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమయిన రోజు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు శనివారం ఆయన స్తోత్రపారాయణం చేయడం స్వామిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది.
సోమవారం శివుడికి ఎంతో ఇష్టమయిన వారం. ఈరోజు స్తోత్ర పారాయణం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. ఆదివారం నాడు సూర్య భగవానుడి స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్యభగవానుడే. ఆయన అశ్వారూఢుడై లోకమంతా సంచరిస్తూ తన కిరణాలతో జాతిని మేల్కొలుపుతూ వుంటాడు. ఆయన స్పర్శ తగిలితే ఎలాంటి మొండి వ్యాధులైనా నయం అవుతాయి.
గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి బాధ అయినా మీ నుంచి దూరమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి వున్నా ఈ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో శుభకరం.