Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఒక నెల పాటు రంజాన్ ఉపవాసం చేసిన అనంతరం, నెలవంక దర్శనంతో షవ్వాల్ మాసం ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజున ఈద్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు అల్లాకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా కూడా భావిస్తారు. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, రంజాన్ మాసంలోనే…