కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల తర్వాత కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై జాతీయ వైద్య కమిషన్ అప్రమత్తం అయింది. ఈ మేరకు మెడికల్ కాలేజీలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక సూచనలు చేసింది.