మేషం: అందరితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వుంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల కోరికలు నెరవేరకపోవడంతో కుటుంబంలో చికాకులు చోటుచేసుకుంటాయి. వృషభం: ఆర్థికంగా ఎంతో కొంత కలిసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు క్రీడలపట్ల అధికమవుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.…