Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో) శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి రెండు గంటలకు…