Liverpool Football Club: ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్లలో ఒకరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీ ఇప్పటికే మన దేశంలోని క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్‌లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ‘ఇండియన్ సూపర్ లీగ్’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోని క్రీడా రంగంలో సైతం పెట్టుబడులు పెట్టనున్నారా అనే వార్తలు వెలువడుతున్నాయి.