Transgender Rights Law : భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన చట్టంలో తీసుకురాబోతున్న నూతన సవరణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2014లో సుప్రీం కోర్టు ‘నల్సా’ (NALSA) తీర్పు ద్వారా అందించిన చారిత్రాత్మక హక్కులను ఈ కొత్త సవరణలు కాలరాస్తున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ తీర్పు ప్రకారం, ప్రతి వ్యక్తికి తన లింగ గుర్తింపును (Gender Identity) స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు…