Killing Patients With Insulin: సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లను డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తాం. కానీ అమెరికాకు చెందిన ఓ నర్సు మాత్రం మనుషుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించింది. మోతాదుకు మించి ఇన్సులిన్ ఇవ్వడం మూలంగా 17 మంది పేషెంట్ల మరణాలకు కారణమైంది. పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ప్రెస్‌డీ(41) ఇన్సులిన్‌తో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకుంది.