హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు నిర్వహించింది. మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి కోసం రేపు కూడా హైదరాబాద్‌లో సిట్ ఉండనుంది. ఇవాళ మూడు చోట్ల గాలించినా కసిరెడ్డి ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కసిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు సమాచారం అందటంతో సిట్ అక్కడకి వెళ్లినా ఫలితం లభించలేదు. కసిరెడ్డి భాగ్యనగరంలోనే ఉన్నారని పక్కా సమాచారం అందటంతో మరో 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తనిఖీల…
Traffic Advisory : ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై, నగరంలోని పలు కీలక ప్రాంతాల గుండా సాగుతూ తాడ్బండ్లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తుంది. శోభాయాత్ర మార్గం పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్ గా వాడుకుని యువతులను బురిడీ కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాడి డాట్ కామ్ ను ఉపయోగించుకున్నాడు. షాది డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.…
Vishnupriya : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు మొత్తం 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి, వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తనపై…
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఈ నెల (మార్చ్) 3వ తేదీన జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు.
ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ , సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని…
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. విధులకు ఆటంకం కలిగిస్తే.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల అండతో పబ్లిక్‌లోనే పోలీసులపై చిందులేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పంజాగుట్ట లో కారు ఓనర్ హల్చల్ సృష్టించాడు. పెండింగ్ చలానాలు చెక్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. నాలుగు వేల పెండింగ్ చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Moinabad Farmhouse : ఇటీవల హైదారాబాద్ నగర శివారు మొయినాబాద్ పరిధిలోని తొల్కట్టలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లతో పాటు పందెం కోళ్లను పట్టుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈ రోజు మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు వేలం వేశారు. అయితే.. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో పందెం కోళ్లకు వేలం నిర్వహిస్తున్నారు…
గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు ఘటనపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో16 కేసులో మోస్ట్ వాంటెడ్ గా ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.