Married Hindu girl abducted in Pakistan, raped: పాకిస్తాన్ లో మైానారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రాంతంలోని థార్, ఉమర్‌కోట్, మీర్‌పుర్‌ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్‌పూర్ ప్రాంతాలలో హిందూ యువతులు, బాలిక అపహరణ కొనసాగుతూనే ఉంది. హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎదిరిస్తే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.