Mumbai Indians Close 10th Place in IPL 2024: ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది.…
Gautam Gambhir Fires on AB de Villiers: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి.. 9 పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. మే 17న లక్నోతో లీగ్ చివరి మ్యాచ్ ఆడి.. ఇంటిదారి పడుతుంది. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీలు ముంబై సారథి హార్దిక్‌ను…
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు…
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.…
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఒక దాని తర్వాత మరొకటి మారిపోతున్నాయి.. వాళ్లే ఇందుకు కారణం.. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి.. కానీ, ఇదే నాకు లాస్ట్ అంటూ రోహిత్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.
Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై…
ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి.
Aaron Finch on Hardik Pandya Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌లలో మూడు విజయాలు మాత్రమే అందుకుని.. ఏకంగా 8 ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల నేపథ్యంలో ముంబైపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా…
Virender Sehwag Fires on Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇప్పుడు లేవు. జట్టు పేలవమైన ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు మాజీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వ నైపుణ్యాలు, ఫీల్డ్‌లో…
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లే. ఇక ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు. శుక్రవారం వాంఖడే మైదానంలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56) పోరాడకుంటే.. ముంబై 100 స్కోర్ కూడా చేసుండేది కాదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) బ్యాటింగ్‌లో తేలిపోయాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసినా 44 పరుగులు సమర్పించాడు. సొంతమైదానంలో వరుసగా…