ప్రపంచంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్-గాజా, ఇరాన్-ఇజ్రాయిల్ వంటి దేశాలు పరస్పర దాడులతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా వెనిజులాపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై ఆందోళన నెలకొంది. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే ఆకాశమే హద్దుగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతుండడంతో యూఎస్, వెనిజులా వార్ మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందంటున్నారు…