హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మెట్రో స్టేషన్‌పై నుంచి దూకడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ చెందిన షబానాగా పోలీసులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలమైనందుకే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ…