పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.