Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతర దేశాలపై టారిఫ్‌లు విధించే నిర్ణయం దేశ అధ్యక్షుడి పరిధిలో లేదని యూఎస్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అంశంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్లతో కలిసి వైట్ హౌస్‌లో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని “అవమానం”గా అభివర్ణించారు.