రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్‌లో ఓ బాలుడి తల కలకలం సృష్టించింది… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ 1 దగ్గర ఓ శిశువు తల కుక్క నోట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఊహించని ఘటనతో స్థానికులు షాక్ తిన్నారు. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో శిశువు తలను పట్టుకొచ్చింది కుక్క.. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..…