Air India Plane Crash: గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో పాటు, నేలపై ఉన్న 34 మంది వ్యక్తులు మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన 30 సెక్షన్లలోపే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 181 మంది భారతీయులు మరణించగా, 52 మంది యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన వారు ఉన్నారు.