బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు వ్యతిరేఖవర్గం ఈమధ్య యాక్టివిటీ బాగా పెంచేసిందంటా..చోటా మోటా లీడర్లను ముందు పెట్టి టికెట్ ఆశించే నేతలు పెద్ద గేమ్ మొదలెట్టారన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా పలానా అభివృద్ది లేదా మంజూరు మాజీ ఎంపీ వల్లనే అయిందంటూ పోస్టులు టిఆర్ఎస్ పార్టీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండగా, ఎమ్మెల్యే వర్గం దానికి కౌంటరిస్తోంది. అంతేకాదు ఫోటోలు ,దానికింద ఇంత మ్యాటర్ సైతం పెట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ అక్కడ నిత్యకృత్యమే. బోథ్…