మానవత్వం మంట కలిసింది. ఖాకీ నిర్లక్ష్యానికి మూడు నెలల చిన్నారి బలైంది.ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. వెయ్యి రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.యాదగిరిగుట్ట పోలీసుల దాష్టీకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో.. ఓ ప్రైవేట్ కారులో హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు…