మేషం : మీ జీవిత భాగస్వామి వైఖరి మీక చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సివుంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వృషభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగ యత్నాలు…