Allu Shirish Wedding: అల్లు వారింట ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన పెళ్లి పిలుపులు కూడా మొదలయ్యాయి. అల్లు శిరీష్ తన పెళ్లికి సంబంధించిన మొట్టమొదటి శుభలేఖను తన మావయ్య, అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ సతీ సమేతంగా మెగా దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఇన్వైట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో అల్లు శిరీష్‌కు తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.…