NTV Telugu Site icon

What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?

Moral Values

Moral Values

Falling in love with others and losing values?  What is the value of marriage?
పెళ్లి అంటే పరాచికమైపోతోంది. వివాహం అంటే నూరేళ్ల పంట కాదు.. మూడు రోజులకే తంటా అనే దుస్థితి వచ్చింది. ప్రియుడి మోజులో భర్తల్ని చంపుతున్న భార్యలు, భార్యను మోసం చేసి నిత్యపెళ్లికొడుకుల్లా వెలుగుతున్న భర్తలు ఊరికొకరు తయారయ్యారు.

భారతీయ సంప్రదాయంలో పెళ్లికి చాలా విలువ ఉంది. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు.. వివాహ వ్యవస్థకు పెనుసవాళ్లు విసురుతున్నాయి. భర్త, భార్య అనే సంబంధాలకు పూర్తిగా నీళ్లొదిలే పరిస్థితి కనిపిస్తోంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు చిన్న విషయాలకే బంధం తెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివాహ బంధాలు విలువ లేకుండా పోతున్నాయనే అభిప్రాయం పెరిగిపోవడానికి కారణం.. కొందరి చేష్టలే!. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యం అనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్‌పై మనసు పారేసుకుంది నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్‌ చేసి.. ఊరు విడిచి పారిపోయింది కూడా. గుడివాడలో ఈ కేసు సంచలనం రేపింది. ఆమె వయసు 30. పెళ్లైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు పిల్లలు. బతుకు బండిని లాగే క్రమంలో భర్త కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించాడు. దానికితోడు అతనికి అనారోగ్యం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఇంకొకరు తోడు కావాలనుకుందామె. ఎదురింటిలో ఉండే ఎయిత్ క్లాస్‌ కుర్రాడిని మచ్చిక చేసుకుంది. అతడితోనే శారీరక సుఖాలు అనుభవించింది. ఆ కుర్రాడిని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలనుకుంది. అతడిని తీసుకుని వెళ్లిపోయింది.

ఒక్కోసారి కొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్ని బంధాల గురించి విన్నప్పుడు నోటి నుంచి మాట రాదు. వయసుతో సంబంధం లేకుండా జరిగే వ్యవహారాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. శారీరక బంధాల కోసం విలువలను కోల్పోతున్నారు కొందరు. క్షణిక సుఖం కోసం వివేకం కోల్పోయి… ఏం చేస్తున్నారో కూడా తెలియడంలేదు. ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కేసు కూడా అలాంటిదే. కానీ ఇక్కడ హత్యలు లేవు. మహిళ మొరాలిటీ కోల్పోయింది. లైంగిక వాంఛలకు బానిస అయిన ఆమె… తన వయసులో సగం కూడా లేని పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది.

గుడివాడలో బాలుడి కిడ్నాప్ కేస్ అనేక మలుపు తిరిగింది. చివరకు సుఖాంతమే అయింది. గుడివాడలోని గుడ్‌మ్యాన్‌పేటకు చెందిన సుందర్‌ రాజు కనిపించకుండా పోయాడు. అతను 8వ తరగతి విద్యార్థి. అతని తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుడివాడ టూ టౌన్ పోలీసులు. అతను హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. 26న సుందర్‌ రాజును పట్టుకున్నారు పోలీసులు.

సుందర్‌ రాజు ఎదిరింట్లోనే ఉండేది స్వప్న. వయసు 30. పెళ్లైంది. నలుగురు పిల్లలు ఉన్నారు. భర్తకు కొద్దికాలంగా అనారోగ్యం. దాంతో అతను భార్యతో సరిగా ఉండటంలేదు. దీంతో ఇద్దరికి మధ్య గ్యాప్ ఏర్పడింది. లైంగిక వాంఛలను అదుపు చేసుకోలేకపోయింది స్వప్న. అదే టైమ్‌లో ఎదిరింటి సుందర్‌రాజును పట్టుకుంది. మొదట అతనితో పరిచయం పెంచుకుంది. ఖాళీ టైమ్‌లో ఇద్దరు కలసి ఉండేవారు. స్కూల్ అయ్యాక పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. కానీ సుందర్‌ రాజు స్వప్న ఇంటికెళ్లేవాడు. స్వప్న ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉండటంతో సుందర్ రాజు తల్లిదండ్రులకు కూడా అనుమానం రాలేదు. 5 నెలల పాటు సుందర్‌రాజుతో చనువు పెంచుకుంది. అతడికి స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూపించి రెచ్చగొట్టింది. సుందర్‌ రాజు కూడా వాటికి అలవాటు పడ్డాడు. నెల క్రితం నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది.

సుందర్‌ రాజు తన లైన్లో పడ్డాడని గుర్తించిన స్వప్న అతడితో కామవాంఛలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరు శారీరక సుఖాలకు అలవాటు పడ్డారు. ఇది దాదాపు నెల రోజులు నడిచింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగించారు. భర్తకు తెలియకుండానే ఇదంతా నడిపించింది స్వప్న. అయితే తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోననే భయం స్వప్నలో అప్పటికే ఉంది. చివరకు తెగించింది స్వప్న. ఏం జరిగినా తనకు అనవసరం అనుకుంది. తన వయసులో సగం కూడా లేని సుందర్‌ రాజుతోనే అన్నీ అనుకుంది. ఈ నెల 19న గుంటూరు వెళ్దామని చెప్పి… సుందర్‌ రాజుతో కలసి హైదరాబాద్ చెక్కేసింది. బాలానగర్ ఏరియాలో చిన్న రూమ్ తీసుకుంది. ఏదైనా పనిచేసుకుంటూ అతనితోనే కలసి ఉండాలనుకుంది.

సుందర్‌ రాజు కనిపించకపోయేసరికి అతని తల్లిదండ్రులు కంగారు పడ్డారు. గుడివాడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు తండ్రి. మరోవైపు స్వప్న పిల్లలను వదిలేసి పరారైన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. సుందర్ రాజుది కిడ్నాప్‌ అనుకున్నా… తల్లిదండ్రులకు ఎలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రాలేదు. స్వప్న, సుందర్‌ రాజుల మిస్సింగ్‌ మ్యాచ్ చేసి చూశారు పోలీసులు. వారిద్దరి మధ్య శారీరక సంబంధాలున్న విషయం బయటపడింది. దాంతో కేసు దర్యాప్తు తీరును మార్చారు. ఇద్దరిని పట్టుకునేందుకు నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక బాలానగర్‌లో స్వప్నతో సెటిల్‌ అయిన సుందర్‌ రాజు డబ్బుల కోసం ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తుండేవాడు. పోలీసులు అటువైపు నుంచి దర్యాప్తు చేయగా… ఇద్దరూ బాలానగర్‌లో ఉన్నట్టు తేలింది. దీంతో 26న ఒక టీమ్ హైదరాబాద్ వచ్చింది. ఇద్దరిని బాలానగర్‌ ఏరియాలోనే పట్టుకున్నారు గుడివాడ పోలీసులు.

స్వప్న, సుందర్‌ రాజులను హైదరాబాద్‌ నుంచి గుడివాడకు తీసుకెళ్లారు పోలీసులు. వారిని ప్రశ్నించగా… ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. సుందర్‌రాజును లోబరచుకుని స్వప్న శారీరక సుఖాలు అనుభవించినట్టు పోలీసులు తెలిపారు. అతడితో కలసి హైదరాబాద్‌లోనే ఉండిపోవాలనే ఉద్దేశంతో స్వప్న వెళ్లిపోయినట్టు గుర్తించారు పోలీసులు. స్వప్నను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పోలీసులు… సుందర్ రాజుకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. స్వప్న మీద కిడ్నాప్ కేసు పెట్టారు గుడివాడ పోలీసులు. అలాగే పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దేశంలో ఒక మహిళపై పోక్సో కేసు పెట్టడం ఇదే మొదటిసారి కావొచ్చనే అంచనాలున్నాయి.

ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన సాయిప్రియ మిస్సింగ్ స్టోరీ మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్ట్‌తో ఎండ్ అయింది. విశాఖ బీచ్‌లో గల్లంతైన సాయిప్రియ బెంగళూరులో తేలింది. ప్రియుడు రవితో పరారైన సాయిప్రియ అతడినే పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లిరోజు తర్వాతి రోజే రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది సాయిప్రియ.

విశాఖపట్నం బీచ్‌లో కనిపించకుండా పోయిన సాయిప్రియ అనే వివాహిత ఆచూకీ బెంగళూరులో దొరికింది. భర్త శ్రీనివాసరావును బురిడీ కొట్టించి ప్రియుడు రవితో పరారైంది సాయిప్రియ. విశాఖపట్నం నుంచి రైళ్లో బెంగళూరు వెళ్లారు రవి, సాయిప్రియ. ఆర్కేబీచ్‌లో మిస్ అయిన సాయిప్రియ బెంగళూరులో పెళ్లిపీటలపై ప్రత్యక్షమైంది. రవి, సాయిప్రియ బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు. పసుపుతాడుతో ఉన్న ఫొటోను వాట్సాప్‌లో తల్లిదండ్రులకు పంపించింది సాయిప్రియ. తాను క్షేమంగానే ఉన్నానని… తన గురించి వెతకొద్దని పేరెంట్స్‌కు మెసేజ్ చేసింది. తనకు చనిపోవాలని లేదని… తన గురించి వెతికితే మాత్రం చనిపోతానని వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులకు వాట్సాప్‌లో ఫొటోతో పాటు వాయిస్ మెసేజ్ పెట్టిందామె. తాను రవి చాలాకాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలిపింది.

ఈ నెల 25న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో సాయిప్రియ గల్లంతు అయింది. సెకండ్ మ్యారేజ్‌ డే కావడంతో శ్రీనివాసరావు, సాయిప్రియులు బీచ్‌కు వెళ్లారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో… శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు. తిరిగివచ్చేలోపు సాయిప్రియ కనిపించలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు శ్రీనివాసరావు. సాయి ప్రియ బీచ్‌లో అదృశ్యం కావడంతో… ఆమె ప్రమాద వశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయి ఉంటుందని భావించారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నేవీ సాయం కోరారు అధికారులు. దీంతో కోస్ట్ గార్డ్‌ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. రెండు కోస్ట్‌ గార్‌ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

సాయిప్రియ మిస్సింగ్‌.. ఎంతో మందిని టెన్షన్‌ పెట్టింది. అధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆమె ఏమైందో అని తెలుసుకునేందుకు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేశారు. ఆచూకీ కోసం సముద్రం మొత్తం గాలించారు. 26న రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. అయినా జాడ దొరకలేదు. ఒకవేళ ఆమె సముద్రంలో మునిగిపోయి ఉంటే కనీసం మృతదేహం అయినా బయటపడి ఉండాలి. అది కూడా జరగకపోవడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. దీంతో మరో యాంగిల్‌లో దర్యాప్తు మొదలుపెట్టారు. సాయిప్రియ ఫోన్ కాల్ డేటాను అనలైజ్ చేశారు. లాస్ట్ కాల్ నెల్లూరు జిల్లా కావలిలో ట్రేస్ అయింది. దీంతో ఆమె సముద్రంలో గల్లంతు కాలేదని నిర్ణయానికి వచ్చారు.

పెళ్లికి ముందే రవి అనే వ్యక్తితో సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడిచింది. ఆమెకు శ్రీనివాసరావుతో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లైన తర్వాత కూడా రవితో ప్రేమాయణం నడిపించింది సాయిప్రియ. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం నుంచి పారిపోవాలని రవి, సాయిప్రియ ప్లాన్‌ చేసుకున్నారు. బీచ్‌కు వెళ్తున్న విషయం రవికి చెప్పింది సాయిప్రియ. వారు రాకముందే బీచ్‌రోడ్డుకు వెళ్లి కాపు కాశాడు రవి. ఫోన్‌ రావడంతో శ్రీనివాస్‌రావు కాస్త పక్కకు వెళ్ళాడు. అదే అదనుగా బీచ్‌ నుంచి రవితో కలసి పరారైంది సాయిప్రియ. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో మునిగిపోయి ఉంటుందని భయపడ్డాడు శ్రీనివాస్‌. వెంటనే కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు.

పెళ్లి రోజే మొగుడికి హ్యాండిచ్చి ప్రియుడితో కలిసి చెక్కేసింది సాయిప్రియ. విశాఖపట్నం నుంచి రైళ్లో బెంగళూరు వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. మొత్తంగా రెండు రోజుల పాటు విశాఖపట్నంలో అధికార యంత్రాంగాన్ని టెన్షన్ పెట్టిన సాయిప్రియ… చివరకు ప్రతీ ఒక్కరికి షాకిచ్చింది.

వివాహ బంధాలకు విలువ లేకుండా పోతోంది. వివాహేతర సంబంధాలు మనుషులనే కాదు మానత్వాన్ని కూడా చంపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ప్రియుడి మోజులో పడి అక్రమ సంబంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే మూర్ఖత్వంతో భర్తలనే అడ్డు తొలగించుకుంటున్నారు భార్యలు. దేనికైనా తెగిస్తున్నారు. ఎన్ని జీవితాలు నాశనమైనా ఇంకా బుద్ధి రావడంలేదు.

వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. హాయిగా సాగాల్సిన దాంపత్య జీవితం అయోమయంగా మారిపోతోంది. భార్యలు తమ భర్తలను దారుణంగా, కిరాతకంగా హతమారుస్తున్నారు. ఆమెలోని మోహం… విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. చాలామంది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా… ప్రియుడి కౌగిలినే కోరుకుంటున్నారు. ఆ సమయంలో హాయిగా అనిపించిన అక్రమ సంబధం జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ప్రియుడితో కలసి భర్తలను అంతం చేస్తున్నారు. ఈ మధ్య చాలా హత్యలు. అన్నింటిలోనూ భార్యలే నేరస్థులు. వాళ్ల ప్రియుళ్లు కూడా నేరంలో భాగమే. మూడు ముళ్లు, ఏడడుగులు, ముద్దులొలికే చిన్నారులు. ఇవేవీ వారిని అడ్డుకోలేకపోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం వివాహేతర సంబంధాల మోజులో భర్తలను చంపి జైలు పాలవుతున్నారు భార్యలు.

విశాఖపట్నంలో జరిగిన ప్రొఫెసర్‌ మురళి హత్య వివాహేతర సంబంధాల్లోని విషాన్ని మరోసారి బయటపెట్టింది. శ్రీకాకుళం జిల్లా పిల్లలవలసకు చెందిన మురళీ ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఆఫ్రికాలోని ఎరిత్రియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట మృదులపై మనసు పడి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఉమ్మడి కుటుంబాన్ని వదిలిపెట్టి ఇల్లరికం వెళ్లడానికి కూడా సిద్ధపడ్డాడు. భార్యకు ఎలాంటి లోటు లేకుండా, కష్టం రాకుండా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. మృదుల కూడా ప్రేమానురాగాలు చూపేది. కానీ అది అంతా కపట ప్రేమ అని అర్ధం చేసుకోలేకపోయాడు. ఆమె ఇష్టం అంతా తాను సంపాదించే డబ్బు మీదే కానీ తన మీద కాదని మురళీ గ్రహించలేకపోయాడు. ఏం మాయరోగమొచ్చిందో పద్దెనిమిదేళ్లు కూడా నిండని ఓ పనిపాటలేని జులాయి మోజులో పడింది. కన్న కొడుకు ఎదురుగానే వివాహేతర సంబంధం సాగించింది. ఏడాది తర్వాత భర్త ఇంటికి వస్తే సంతోషంగా ఉన్నట్టు నటించింది. కానీ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని లోలోపల రగిలిపోయింది. చివరకు తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.

పెళ్లయ్యేనాటికి మురళీకి 31. మృదులకు 21 ఏళ్లు. ఇప్పుడామెకు ముప్పై ఏళ్లు… భర్తకేమో ఫార్టీ ప్లస్. పెళ్లైన తర్వాత భర్తతో పాటే ఎరిత్రియా వెళ్లింది మృదుల. పెళ్లైన ఏడాదిలోనే వారికి ఓ బాబు పుట్టాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య, కొడుకు సర్వస్వం అనుకున్నాడు. నాలుగేళ్లు ఎరిత్రియాలోనే ఉన్నారు. 2018లో అనారోగ్య సమస్యల కారణంగా ఇండియా వచ్చింది మృదుల. ఇక తాను అక్కడకు రానంటూ ఇక్కడే సెటిల్ అయింది. విశాఖపట్నంలోని తల్లిగారింట్లోనే ఆమె ఉండేది. అత్తగారిల్లు అయిన శ్రీకాకుళంలోని పిల్లలవలస అస్సలు వెళ్లేది కాదు. వారి యోగక్షేమాలు కూడా పట్టించుకునేది కాదు. మురళీ కూడా భార్య లెక్కలేని తనాన్ని పట్టించుకునేవాడు కాదు. ఆమె ఆడిందే ఆట… పాడిందే పాట. మురళి ఎరిత్రియాలో ఉద్యోగం చేసుకునేవాడు. 10 నెలలు ఉద్యోగం. 2 నెలలు హాలీడే. ఆ రెండు నెలలు భార్యతో కలసి విశాఖపట్నంలో ఉండేవాడు మురళి. అప్పడప్పుడు వెళ్లి శ్రీకాకుళంలోని తన తల్లిదండ్రులు, అన్నాదమ్ములను కలిసేవాడు. తల్లిదండ్రుల కంటే భార్యకే ప్రాధాన్యం ఇచ్చేవాడు మురళి. ఏం అడిగిన కాదనుకుండా చేసేవాడు. అలా వారి సంసారం ఆరేడేళ్లు సాగిపోయింది. ఏడాది క్రితం వారి కథలోకి విలన్ ఎంట్రీ ఇచ్చాడు.

మురళీ, మృదుల మధ్య గొడవలేమీ లేవు. బాగానే ఉన్నారు. మనసెప్పుడు ఒకేలా ఉండదు కదా. మృదుల విషయంలోనూ అదే జరిగింది. ఏడాదిలో 10 నెలలు ఒంటరిగా ఉండాల్సి రావడంతో ఆమె పక్కచూపులు మొదలయ్యాయి. ఆ చూపుల్లోనే ఒకడు చిక్కుకున్నాడు. అతని పేరు హరిశంకర్ వర్మ. వయసు ఇప్పుడు 18. మృదుల కంటే దాదాపు 12 ఏళ్లు చిన్నవాడు. చదువుసంధ్యలు సరిగా లేవు. ఇంటర్‌ డిస్‌ కంటిన్యూ చేసి జులాయిగా తిరిగేవాడు. అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఒకే కాలనీలో ఉండేవాళ్లు. అలా మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అంతకుముందే అంటే హరిశంకర్‌ చిన్నప్పుడే మృదులకు పరిచయం. ఫిఫ్త్ చదువుతున్నప్పుడే ట్యూషన్‌కు వెళ్తున్నప్పుడే మృదులకు పరిచయం. కానీ మధ్యలో విడిపోయారు. పనీపాటలేకుండా తిరిగే హరిశంకర్ వర్మ… అక్కా అంటూ మృదుల చుట్టూ తిరిగేవాడు. ఈమె కూడా తమ్ముడు అంటూ వరస కలిపింది. వారి మధ్య పరిచయం పీక్స్‌కి వెళ్లింది. ఇదంతా మృదుల వాళ్ల అమ్మగారింట్లో ఉన్నప్పుడే మొదలైంది.

ఈ మధ్య మధురవాడ రిక్షా కాలనీలో ఓ ఫ్లాట్ కొన్నాడు మురళి. కుటుంబాన్ని ఫ్లాట్‌లోకి షిఫ్ట్ చేశాడు. తల్లిగారింట్లో ఉన్నప్పుడు మృదులకు అమ్మనాన్నలు తోడుగా ఉన్నారు. ఫ్లాట్‌లో కొడుకుతో కలసి ఒక్కతే. ఇంకేం. హరిశంకర్‌ కు కావాల్సినంత ప్రైవసీ దొరికింది. నేరుగా ఫ్లాట్‌కు వెళ్లిపోయేవాడు. పనుల్లో సాయపడేవాడు. పిల్లాడితో ఆడుకునేవాడు. వాట్సాప్‌లో గంటలతరబడి ఛాటింగ్ చేసేవారు. అక్కా తమ్ముళ్లు అంటూ మొదలైనవారి పరిచయం అక్రమ సంబంధం వైపు మళ్లింది. వయసు తేడాను కూడా మరిచిపోయారు. అడ్డుగా ఎవరూ లేకపోవడంతో రసికలోకంలో మునిగితేలారు. ఓ సారి మురళి వాళ్ల అన్నయ్య ఊరి నుంచి చూడడానికి ఇంటికి వచ్చినప్పుడు హరి శంకర్ ఫ్లాట్‌లోనే కనిపించాడు. అతను ఎవరు..? ఇక్కడేం పని అని ప్రశ్నించాడు. హరిశంకర్ తనకు తమ్ముడిలాంటివాడని… ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతాడని మృదుల దబాయించింది. వాడి వయసేంటీ..? నా వయసేంటని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే మురళి అన్నయ్యలో అనుమానం పోలేదు. అప్పటికి సర్దుకున్నాడు. తర్వాత మాటువేసి హరిశంకర్, మృదులలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విషయం ఎరిత్రియాలోని మురళికి చెప్పాడు. అతను కూడా భార్యకు ఫోన్ చేసి అడిగాడు. అలాంటిదేమీ లేదని ఆమె బుకాయించింది. భార్యపై అలవిమాలిన ప్రేమతో ఉన్న మురళి ఆమెనే నమ్మాడు. అన్న చెప్పిన మాటలు పట్టించుకోలేదు. పైగా తన భార్య అలాంటిది కాదని వాళ్లకే కౌంటర్ ఇచ్చాడు.

తర్వాత కూడా మురళికి మృదుల ప్రవర్తన గురించి తరచూ కుటుంబసభ్యులు చెప్పేవారు. అంత గట్టిగా చెప్పేసరికి మురళిలో కూడా అనుమానం వచ్చింది. ఈ నెల 9న విశాఖపట్నం వచ్చాడు మురళి. వివాహేతర సంబంధంపై నిలదీశాడు. ఆ రోజు గొడవ జరిగింది. 10న హరిశంకర్‌తో కలసి మురళిని చంపేసింది మృదుల. ఇద్దరు కలసి శవాన్ని మారికవలస దగ్గర బ్రిడ్జ్ కింద పడేశారు. మరో మూడు రోజులకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అడ్డు తొలగించుకున్నామని హ్యాపీగా ఫీలయ్యారు. 10 రోజులు గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మృదుల, హరిశంకర్‌లు కటకటకాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

విశాఖపట్నం శివారులోని మారికవలస దగ్గర నేషనల్‌ హైవే పక్కన డ్రైనేజీ బ్రిడ్జ్‌ పక్కనే మృతదేహం కనిపించింది. ఎవరో దానిని గమనించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. అది దాదాపు అస్థి పంజరం మాదిరిగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు చాలా కష్టపడ్డారు. చివరకు నాలుగు రోజుల క్రితం PMపాలెం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసులోని వ్యక్తిదే ఆ మృతదేహం అని గుర్తించారు పోలీసులు. అతను చనిపోయి దాదాపు 10 రోజులు అయినట్టు నిర్థారణకు వచ్చారు. ఎలా చనిపోయాడన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.

తన భర్త మురళి కనిపించడంలేదంటూ మృదుల ఈ నెల 17న PMపాలెం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. ఈ నెల 9న ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశం నుంచి వచ్చిన తన భర్త బుడుమూరు మురళి 11న శ్రీకాకుళం వెళ్లినట్టు కంప్లైంట్‌లో తెలిపింది. మురళి సొంతూరు శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస. అతను ఎరిట్రియా ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎనిమిదేళ్లుగా ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈ సారి కూడా సెలవుల కోసం ఇండియా వచ్చాడు మురళి. 9న విశాఖపట్నం చేరుకున్నాడు. 11న శ్రీకాకుళం వెళ్లినట్టు మృదుల పోలీసులకు కంప్లైంట్ చేసింది. కానీ మురళి తన సొంతింటికి వెళ్లలేదు. సీన్‌ కట్ చేస్తే… మారికవలస దగ్గర దొరికిన శవం మురళీదేనని పోలీసులు తేల్చారు.

ఈ నెల 9న మురళి విశాఖపట్నం వచ్చింది నిజమే. జులై, ఆగస్ట్‌ సెలవులు కావడంతో ఎరిత్రియా నుంచి వచ్చాడు మురళి. అతను విశాఖవచ్చిన విషయం తల్లిదండ్రులు, అన్నాదమ్ములకు కూడా తెలుసు. 10న రాత్రి మురళికి ఫోన్ చేశాడు అతని అన్న. ఫోన్ కలవకపోవడంతో తర్వాతి రోజు అంటే 11న మృదులకు ఫోన్ చేశారు. ఇక్కడే భార్య మృదులు తన అసలు డ్రామా మొదలు పెట్టింది. ఆ ఉదయమే మురళి పిల్లలవలస బయలుదేరాడని, తానే స్వయంగా స్కూటీపై కొమ్మాది జంక్షన్‌లో దింపానని, అక్కడి నుంచి ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి తీసుకువెళ్లారని కథ అల్లింది. వారం గడిచినా మురళీ ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబసభ్యులంతా విశాఖ వచ్చారు. మృదులను గుచ్చిగుచ్చి అడగడం మొదలెట్టారు. మృదుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం… ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో మురళీ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హరిశంకర్, మృదుల రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం గుర్తుకు వచ్చిన మురళి అన్న మల్లేష్‌… మృదులపైనే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితిలో 17న విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. శ్రీకాకుళం వెళ్లేందుకు తన భర్తను ఈనెల 11న కొమ్మాది జంక్షన్‌లో స్కూటీపై దింపానని, అతని స్నేహితులు ఇద్దరు వచ్చి తీసుకువెళ్లారంటూ ఫిర్యాదులో తెలింది. మిస్సింగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

ప్రతీ ఏడు లాగానే ఈ సారి కూడా రెండు నెలలు విశాఖలో ఉండేందుకు వచ్చాడు మురళి. ఈ విషయం హరిశంకర్‌కు చెప్పింది మృదుల. ఈ రెండు నెలలు నిన్ను కలవడం, నీతో మాట్లాడడం, చాటింగ్ చేయడం కుదరకపోవచ్చని చెప్పింది. రెండు నెలలు నిన్ను కలవకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేనన్నాడు హరిశంకర్. దీంతో ఇద్దరు కలసి ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. ఇద్దరి బంధానికి అడ్డుగా ఉన్న మురళిని అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. 9న ఎరిత్రియా నుంచి వచ్చిన మురళి తన అన్న చెప్పిన మాటలు విని మృదులను నిలదీశాడు. గొడవ జరిగినా అప్పటికేదో చెప్పి తప్పించుకుంది. అదే రోజు రాత్రి హరిశంకర్‌కు ఫోన్ చేసింది మృదుల. జరిగిందంతా చెప్పింది. ఇక ఆలస్యం చేయకుండా మురళిని తప్పించాలని నిర్ణయించుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న మురళిని కుక్కర్ కొట్టి చంపారు. ఇదంతా తన ఏడేళ్ల కొడుకు కళ్ల ముందే చేసింది మృదుల. అప్పటికే మురళి ప్రాణాలు విడిచాడు. అయినా ఇంకా ఏమూలో ప్రాణం ఉందనుకుని తాడుతో మెడకు బిగించి ఉరేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక… గోనెసంచిలో మృతదేహాన్ని మూటకట్టారు. కొడుకును ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. 10న తెల్లవారుజామున మృతదేహాన్ని ఇద్దరు కలిసి స్కూటీపై మారికవలస బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లి కాలువలో పడేశారు.

10 నాడు కుటుంబసభ్యులు మురళికి ఫోన్ చేశారు. కలవలేదు. తర్వాతి రోజు మృదులకు ఫోన్ చేశారు. ఊరికే వచ్చాడని మృదుల అబద్ధం చెప్పింది. అయినా ఎక్కడో ఆమెలో భయం మొదలైంది. దీంతో మళ్లీ హరిశంకర్‌ను పిలిచింది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తే హత్య విషయం ఎక్కడ బయటపడుతుందోని ఇద్దరూ ఆందోళన పడ్డారు. దీంతో 14న వర్షం పడుతుండగానే… రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని మారికవలస వెళ్లాడు హరిశంకర్. మృతదేహం కట్టి ఉంచి మూటపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పటికే కుళ్లిన మృతదేహం ఇప్పుడు పూర్తిగా కాలిపోయింది. పుర్రె, ఎముకలు మాత్రమే మిగిలాయి.

మురళి మృతదేహం లభించింది. అది మురళీదేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసినప్పట్నుంచే మృదులను అనుమానించిన పోలీసులు… ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటపడింది. మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మృదుల, హరిశంకర్‌ వర్మలను అరెస్ట్ చేశారు పోలీసులు. హరిశంకర్‌ కుటుంబసభ్యుల పాత్ర కూడా ఉందన్న మురళి కుటుంబసభ్యుల అనుమానంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ నెల 9న మురళిని హత్య చేయకముందు చాలా విషయాలు జరిగాయి. మురళి ఆఫ్రికా నుంచి రాగానే మృదులతో కలసి డైమండ్‌ పార్క్‌ దగ్గర్లోని బ్రోకరేజీ ఆఫీస్‌కు వెళ్లి తన దగ్గరున్న ఆఫ్రికన్ కరెన్సీని ఇండియన్ రూపీల్లోకి మార్చుకున్నాడు. మొత్తం 13 లక్షలు వచ్చింది. అందులో 8 లక్షలు మృదుల అకౌంట్‌లో వేశాడు. 5 లక్షలు తన అకౌంట్‌లో డిపాజిట్ చేసుకున్నాడు మురళి. అతడిని హత్య చేసిన తర్వాత హరిశంకర్‌కు బైక్‌ కొనిచ్చింది మృదుల. హరిశంకర్‌ ఇంట్ల లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

దాంపత్య బంధాలను క్షణికావేశం భగ్నం చేసేస్తోంది. మూడుముళ్ల బంధానికి వివాహేతర బంధాలు ముళ్ల కంపల్లా తగులుకుంటున్నాయి. పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. అన్నెంపున్నెం తెలియని పిల్లలను అనాథలను చేసేస్తున్నాయి. కుటుంబ బంధాలు ఎందుకు పలుచనవుతున్నాయి..? అవగాహనా లోపమా..? అసహనమా..? క్షణికమైన బంధాల మోజులో పడి మహిళలు సున్నితత్వం కోల్పోతున్నారా..?

సాఫీగా సాగే జీవితాలను వివాహేతర సంబంధాలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందేళ్ల జీవితాలను యవ్వనంలోనే తుంచేసుకుంటున్నారు కొందరు. బంధాలకు విలువ లేకుండా పోతోంది. అందుకే ప్రియుడి మోజులో పడి భర్తలను అడ్డు తొలగించుకుంటున్నారు భార్యలు. భర్తలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సుఖపడొచ్చన భావన వారినలా చేయిస్తోంది. కానీ భర్తను చంపినా వారు బావుకునేదేమీ ఉండదు. చివరకు జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెట్టడం తప్ప. అయితే అన్నీ తెలిసినా తెగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలను చూస్తుంటే దాంపత్య బంధంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గతంలో నాగర్ కర్నూల్‌లో సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి హత్య చేసిన తీరు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. భర్తను కాదనుకుని ప్రియుడు రాజేష్ వ్యామోహంలో మునిగిపోయింది స్వాతి. భర్త లేని సమయంలో స్వాతికి దగ్గరయ్యాడు రాజేష్. వీరి వ్యవహారం తెలిసిన భర్త సుధాకర్ రెడ్డి స్వాతిని వారించాడు.. కోపంతో చేయి కూడా చేసుకున్నాడు. ఇద్దరి మధ్యా సంబంధాలు అలా దెబ్బతిన్నాయి. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై రోకలితో దాడి చేసి, దిండుతో ఊపిరాడకుండా చేసి సుధాకర్‌ రెడ్డిని దారుణంగా చంపేశారు. తర్వాత శవం కూడా దొరక్కుండా కాల్చేశారు. స్వాతి భర్త ప్లేస్‌లోకి వెళ్లేందుకు రాజేష్ ముఖాన్ని పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. రాజేష్‌ను సుధాకర్‌గా చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ చేసింది స్వాతి. రాజేశ్‌ను సుధాకర్‌ మాదిరిగా ఫేస్‌ మార్చేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని ఫిక్స్‌ అయ్యారు. కానీ చిన్న కారణంతో దొరికిపోయారు. చిన్న పిల్లల జీవితం, భవిష్యత్‌ను లెక్క చేయకుండా ప్రియుడి కోసం భర్తను చంపింది స్వాతి. భర్త అడ్డు తొలగించుకుని ఆ స్థానంలో ప్రియుడిని తెచ్చి అతగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆపై హైదరాబాద్‌ నుంచి చెక్కేయాలనే మెగా స్కెచ్ వేసింది స్వాతి. చివరికి ఇద్దరు కలసి కటకటాల పాలయ్యారు.

సుధాకర్‌ రెడ్డిని స్వాతి చంపిన ఇష్యూ నడుస్తుండగానే… హైదరాబాద్ శివార్లలో అలాంటిదే మరో ఘటన జరిగింది. నాగరాజు అనే కార్పెంటర్‌ దారుణంగా హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతి నాచారంలోని మేనమామ ఇంటికి తరచుగా వెళ్లి వస్తుండేది. అక్కడే ఉండే కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. కార్తీక్, జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైమ్‌లో తల్లిదండ్రులు జ్యోతిని నాగరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లకు జ్యోతి మళ్లీ కార్తీక్‌ను కలవడంతో… వారి మధ్య సాన్నిహిత్యం మళ్లీ పెరిగింది. విషయం తెలిసిన నాగరాజు జ్యోతిని మందలించాడు. దాంతో జ్యోతి కొంతకాలం సైలెంట్ అయ్యింది. అయితే కార్తీక్‌ను మరిచిపోలేకపోయింది. నాగరాజు అడ్డును తొలగించుకుంటే… తమకు ఇబ్బందులుండవని జ్యోతి, కార్తీక్ భావించారు. ఇద్దరూ పక్కా స్కెచ్ వేశారు. నాగరాజుకు నిద్ర మాత్రలిచ్చి… మత్తులోకి జారుకోగానే కార్తీక్ కు ఫోన్ చేసింది జ్యోతి. ఇద్దరూ కలసి నాగరాజు ముఖంపై దిండుతో బలంగా అదిమి చంపేశారు. ఆ తర్వాత అద్దెకు తెచ్చిన కారులో మృతదేహాన్ని చౌటుప్పల్ దగ్గర పొదల్లో పడేశారు.
.
జూన్ 30న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రియుడితో కలసి భర్తను చంపిందో భార్య. కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్‌కు వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీళ్లు నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు ప్రాంతానికి కూలీ పనికోసం వలస వచ్చారు. దౌల్తాబాద్‌ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రమేష్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తర్వాత పని కోసం ఇద్దరూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి పని కోసం వెళ్లారు. ఎల్లారెడ్డిలో జూన్ 30న రాత్రి 11 గంటల సమయంలో దస్తప్ప, వెన్నెల రెడ్‌ హ్యాండెడ్‌గా రమేష్‌కు దొరికిపోయారు. తమ భాగోతం బట్టబయలు కావడంతో… రమేష్‌ను చంపాలని ఆ క్షణమే డిసైడయ్యారు. దస్తప్ప రమేష్‌ గొంతు నులమగా… వెన్నెల కాళ్లు గట్టిగా పట్టుకుని కదలకుండా చేసింది. రమేష్‌ మృతదేహాన్ని తాము పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే రాత్రికిరాత్రే పూడ్చిపెట్టారు. తర్వాతి రోజు రమేష్‌ అన్న వెంకటప్పకు వెన్నెల ఫోన్ చేసింది. రమేష్‌ కర్ణాటకకు వెళ్లాడని చెప్పింది. తర్వాత కొద్దిరోజులకు వెన్నెల అత్తగారింటికి వెళ్లింది. అనుమానం వచ్చిన రమేశ్‌ కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి అన్న వెంకటప్ప ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశాడు. స్పాట్‌కు వెళ్లిన పోలీసులు… తహశీల్దార్‌ సమక్షంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రమేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. వెన్నెల, దస్తప్పలను అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో కామారెడ్డి జిల్లాకు చెందిన శంకరయ్య అనే పండ్ల వ్యాపారి హత్య జరిగింది. ఒంటరిగా దానిమ్మ తోటకు వెళ్లిన శంకరయ్య తిరిగి రాలేదు. శంకరయ్య, జయసుధ భార్యాభర్తలు. 14 ఏళ్ల క్రితం పటాన్‌చెరు దగ్గర్లోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. శంకరయ్య శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. భార్య జయసుధ బీరంగూడలో పండ్ల దుకాణం నిర్వహించేంది. అక్కడకూ తిరుపతిరావును అనే జిమ్ ట్రైనర్ తరచూ వచ్చి వెళ్లేవాడు. జయసుధ, తిరుపతి రావుల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ పీకల్లోతు మునిగిపోయారు. ఈ నెల 11న శంకరయ్య ఒంటరిగా తోటకు వెళ్తున్నాడని… తిరుపతిరావుకు ఫోన్ చేసింది జయసుధ. తోట దగ్గరే శంకరయ్యను ఫినిష్ చేయాలని సూచించింది. దీంతో తిరుపతిరావు టంగుటూరు గ్రామ శివార్లలో శంకరయ్య కోసం కాపు కాశాడు. తోటను చూసుకుని తిరిగి వస్తుండగా శంకరయ్య తిరిగివస్తుండగా… వెనక నుంచి కర్రతో దాడి చేశాడు తిరుపతిరావు. ముందు తలపై బలంగా కొట్టాడు. తర్వాత కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము హత్య జరిగింది. చెరువుగట్టున అతని మృతదేహం లభించింది. యాక్సిడెంట్ జరిగినట్టు అతని భార్య తులసి అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే రాము తమ్ముడుకి అనుమానం రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు రాముది హత్యేనని తేల్చారు.
తులసికి సాలూరు మండలం శంబర గ్రామానికి చెందిన సన్యాసినాయుడుతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం రాముకు తెలియడంతో తులసితో గొడవపడ్డాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవలతో తమ 15 ఏళ్ల కొడుకు ఆందోళనకు గురయ్యేవాడు. తప్పెవరిదో అతనికి తెలియదు. అంతా అయోమయం. కొడుకు స్థితిని తల్లి వాడుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని డిసైడైన తులసి కొడుకును ట్రాప్ చేసింది. తండ్రిపై లేనిపోనివి నూరిపోసింది. అతనిలో తండ్రి పట్ల ద్వేషం పెంచింది. తల్లి దుర్బుధ్దిని గ్రహించలేని ఆ పిల్లాడు తల్లికి సహకరించాడు. ఈ నెల 11న రాత్రి 9 గంటల సమయంలో కొడుక్కి బాగాలేదని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని రాముకు చెప్పింది తులసి. తండ్రీ కొడుకులు బైక్‌పై విజయనగరం బయల్దేరారు. లక్ష్మీసాగరం చెరువ దగ్గర రాగానే తనకు కడుపులో బాగాలేదని బైక్ ఆపించాడు కొడుకు. అక్కడే కాచుకుని ఉన్న సన్యాసినాయుడు రాముపై వెనక నుంచి కర్రతో దాడి చేశాడు. ప్రాణం పోయేవరకు కొట్టాడు. రాము హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనుకున్నాడు సన్యాసినాయుడు. రాము మృతదేహాన్ని చెరువు గట్టు నుంచి రోడ్డుపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో… ఆ ప్లాన్ అమలు చేయలేకపోయారు. చెరువుగట్టునే శవాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. ఇప్పుడు తులసి, సన్యాసినాయుడు జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

స్వాతి, జ్యోతి, వెన్నెల, జయసుధ, తులసి ఇలా అన్ని కేసుల్లోనూ ఒకే కారణంతో భర్తలు హత్య చేయబడ్డారు. భర్తపై వ్యతిరేకత, పరాయి పురుషుడిపై మోజు భర్తలను చంపేలా వారిని ప్రేరేపించాయి. పెళ్లిళ్లను తృణప్రాయంగా భార్యలే భావించడం విచిత్రంగా కనిపిస్తోంది. సాధారణంగా అక్రమ సంబంధాల్లో ప్రియుడి చొరవే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ… ఇక్కడ భర్తల అడ్డుతొలగించుకోడంలో భార్యలే మాస్టర్ స్కెచ్ వేశారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్, వాట్సప్.. అంటూ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. వీటిమీద ఎన్ని సైటైర్ల్ వేసినా జనం మాత్రం వాళ్ల అలవాటు మానుకోవటం లేదు. తెలిసీ తెలియక ఫేస్‌బుక్ లో ఓ వివాహిత చేసిన స్నేహం.. అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. నాలుగు నెలల వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్తతో కొత్త కాపురం మొదలు పెట్టిన యువతికి భర్త ఆఫీస్ కి వెళ్ళాక సెల్ ఫోనే లోకమయ్యింది. మళ్లీ భర్త సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగివచ్చే దాకా సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తూ ఉండేది.

ఈ క్రమంలోనే ఆమెకు వనపర్తి జిల్లాకు చెందిన సందీప్ అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుకుని జీవనం సాగిస్తున్న సందీప్‌ ఆమెతో చాలా క్లోజ్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. క్రమేపి వీరి పరిచయం చాటింగ్ స్ధాయి నుంచి వీడియో కాల్స్ వరకు వెళ్ళింది.సందీప్ మాటలకు మైమరచిపోయిన యువతికి అతనే లోకం అయ్యాడు.

 

Show comments