Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About Illegal Parties In Hyderabads Farmhouses A Growing Crisis Amidst Drug Use Prostitution And Crime

Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

Published Date :March 18, 2026 , 9:13 pm
By Sudhakar Ravula
Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అసలు ఇల్లీగల్ వ్యవహారం ఏది చేయాలన్నా దానికి ఫామ్‌హౌస్‌ను మించిన ప్లేస్ లేదనే రేంజ్‌ కనిపిస్తోంది. అన్ని ఫామ్‌హౌస్‌లు ఇలాగే ఉన్నాయని చెప్పలేం కానీ.. దాదాపుగా 20 శాతం ఫామ్‌హౌస్‌లు కేవలం చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచే ఆదాయం ఆర్జిస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. మామూలుగా డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు సిటీ సెంటర్లలో చేసుకోవడం కష్టం. అదే శివారుల్లో ఉండే ఫామ్‌హౌస్‌లైతే ప్రైవసీకి ప్రైవసీ.. పోలీసుల దృష్టి కూడా తక్కువగా ఉంటుందనే ధీమాతో పార్టీ లవర్స్.. వీకెండ్ వస్తే చాలు.. ఏదో ఒక ఫామ్‌హౌస్ బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది ఫామ్‌హౌస్‌ యజమానులు.. ఇల్లీగల్ పార్టీలకు తగ్గట్టుగా ఫామ్‌హౌసుల్లో రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ.. అందుకు తగ్గట్టుగా ఛార్జ్ వసూలుచేస్తున్నారు. అయితే డ్రగ్స్, రేవ్ పార్టీలు, అశ్లీలనృత్యాల మోజులో ఎంతైనా ఇవ్వటానికి పార్టీ లవర్స్ రెడీగా ఉండటంతో.. ఫామ్‌హౌస్ యజమానుల పంట పండుతోంది. దీంతో మొదట్లో కేవలం అద్దె, లీజుకివ్వటానికే పరిమితమైన ఫామ్‌హౌస్‌లు.. ఇప్పుడు రేవ్, డ్రగ్స్ పార్టీలకు ఆతిథ్యం ఇచ్చే కేంద్రాలుగా మారడంతో.. పాటు గుట్టుచప్పుడు కాకుండా జరిగే వ్యవహారాలకు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాయి. కాకపోతే తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటైన ఈగల్ టీమ్ కన్ను పడటంతో.. ఇప్పుడు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టైంది. అప్పటికీ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం గట్టిగా జరిగింది. ఏకంగా పోలీసులపై కాల్పులు జరిగే వరకు వచ్చింది పరిస్థితి. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారం.. మొత్తంగా ఫామ్‌హౌసుల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల్ని కట్టడి చేయాల్సిన అవసరాన్ని చాటుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఫామ్‌హౌసుల్లో జరిగే చట్టవ్యతిరేక పనులపై దృష్టి సారించాల్సి ఉంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ గత నాలుగేళ్లలో ఏదో ఒక వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలలో పట్టుబడుతుండటం విమర్శలకు తావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందన్న స్టింగ్ ఆపరేషన్ ఎపిసోడ్ అప్పట్లో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపింది. 2022 అక్టోబర్ 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ఈ ఫామ్ హౌస్ అడ్డాగా నిలిచి వార్తల్లోకి ఎక్కింది. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ అప్పటి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఏకంగా ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో జరిగిన భేరసారాలకు సంబంధించిన సంభాషణలతో కూడిన ఆడియోలు, వీడియోలను హైకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లు సహా దేశం అంతా పంచేశారు..వినిపించేశారు. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఈ ఫామ్‌ హౌజ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారన్న అభియోగాలతో కేసు కొనసాగుతుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తో బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వం చేసిన హడావుడి వెనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాగి ఉండటం మరో ట్విస్టుగా నిలిచింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘట్టం కూడా బయటపడటం ఆ కేసులను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. రాజకీయాలు..నేరాలు, ఆర్థిక వ్యవహారాలు, చట్టాల దుర్వినియోగాలతో కలగలిసిన ఆ రెండు కేసులు ఎప్పుడు తేలుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ప్రలోభాలు..కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో ముడిపడి ఉన్న మెయినా బాద్ ఫామ్ హౌస్ ఇప్పుడు డ్రగ్స్ పార్టీతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి కొనసాగుతున్న డ్రగ్స్ పార్టీపై ఈగల్‌ బృందం జరిపిన దాడుల్లో రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు మొత్తం 11మంది పట్టుబడటం కలకలం రేపింది.

మెయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుందన్న పక్కా సమాచారంతో ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ, లోకల్‌ పోలీస్‌లు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీత్ మిశ్రా వారిని బెదిరించేందుకు రివాల్వర్ తో నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపడం మరింత సంచలనంగా మారింది. ఆ రివాల్వర్ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. వ్యక్తుల స్థాయిని బట్టి ఫామ్‌హౌసుల్లో పార్టీలు ఏర్పాటవుతున్నాయి. స్టూడెంట్స్, యూత్ అయితే ఒకలా.. వీఐపీలు, సెలబ్రిటీల భాగస్వామ్యం ఉంటే మరోలా పార్టీలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొంతమంది ఫామ్‌హౌసుల్ని ముందే బుక్ చేసుకుని.. తమ పార్టీలకు తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. కొంతమంది మరో అడుగు ముందుుకేసి సొంత ఫామ్‌హౌసుల్లోనే మిత్రులు, సన్నిహితులకు డ్రగ్స్ పార్టీలిస్తూ.. రేవ్ పార్టీలు అరేంజ్ చేస్తూ అడ్డంగా బుక్కైపోతున్నారు.

నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు రాత్రివేళ వినోదాలకు కేరాఫ్ అడ్రస్​గా మారుతున్నాయి. మందు, విందు పుట్టినరోజు వేడుకలతో పాటు ముజ్రా, రేవ్‌ పార్టీలూ కొనసాగుతున్నాయి. కొన్నింటిలో ఏకంగా డ్రగ్స్‌ పార్టీలూ జరుగుతున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫామ్‌హౌస్‌లను మినహాయిస్తే రంగారెడ్డి జిల్లాలోని 900 ఫామ్‌హౌస్‌లకు సంబంధిత అధికారుల నుంచి తగిన అనుమతుల్లేవు. రెవెన్యూ రికార్డుల్లో ఇవి పంట పొలాలు, భూములు గానే ఉంటాయి. వాస్తవానికి వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ కొందరు మాత్రం తమకు నిబంధనలేమీ పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే నిర్మాణాలు చేసేస్తున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్‌హౌస్‌లున్నాయి. కొంతమంది వీటిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ముజ్రా పార్టీలు నిర్వహిస్తామంటూ సోషల్​ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. శుక్ర, శనివారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, పోలీసుల తనిఖీలు ఉండవంటూ వారికి భరోసా ఇస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. కొంతమంది ఈ ఫాంహౌస్​లను కోడి పందేలు తదితరాల నిర్వహణకూ ఉపయోగిస్తున్నట్లుగా గతంలో పోలీసు తనిఖీల్లో బయటపడింది.

ఫామ్​హౌస్​ల్లో దారుణాలు ఏ రేంజ్‌కు చేరాయంటే.. చివరకు మైనర్లు కూడా అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. గతేడాది మొయినాబాద్​లోని ఓ ఫామ్​హౌస్​లో మైనర్ల పార్టీ వ్యవహారం దుమారం రేపింది. నగరానికి ఒక డీజే ఇన్​స్టాలో ట్రాప్​హౌస్​ 9MM పేరుతో అకౌంట్​ నిర్వహించేవాడు. మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో ట్రాప్​హౌస్​ నిర్వహిస్తున్నట్లుగా విపరీతంగా ప్రకటనలు గుప్పించి అందరినీ ఊరించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా నిర్ణయించాడు. ఇన్​స్టాలో ఇది చూసి మైనర్లు సిద్ధమయ్యారు. మొయినాబాద్​లోని ఓ ఫామ్​హౌస్​కు చేరారు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం బాకారంలోని ఓ ఫామ్​హౌస్​లో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉగాండా, కెన్యాతో పాటు మరో రెండు ఆఫ్రికన్ దేశాలకు చెందిన 51 మందిని గుర్తించారు. అక్కడ జరిగిన పార్టీలో డ్రగ్స్​, గంజాయి వాడుతున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. పలు మద్యం బాటిళ్లను గుర్తించారు.

మహేశ్వరం, మొయినాబాద్‌ మండలాల్లో అత్యధికంగా 500 వరకు ఫామ్‌హౌస్‌లు ఉండగా కోహెడలో 35 ఉన్నాయి. పంచాయతీ, పురపాలక అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనల ప్రకారం కట్టాలంటే వ్యవసాయేతర భూమిగా ముందు మార్చుకోవాల్సి ఉంటుంది. 300 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, మరోవైపు చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొన్ని ఫామ్​హౌస్​లపై పోలీసులు ఇప్పటికే దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మరింత నిఘా పెంచాల్సి ఉంది.
కొన్నేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్‌లు అసాంఘిక చర్యలకు అడ్డాలుగా మారాయి. నిబంధనలు గాలికొదిలేయడంతో యాజమాన్యాల ఇష్టారాజ్యంగా తయారైంది. ఫాంహౌస్‌లకు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో… ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా గందరగోళమే. డ్రగ్స్ పార్టీలు యథేచ్చగా జరుగుతున్నాయి. విదేశీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. పోలీసులు అనుమతి తీసుకుంటే, నిఘా పెరుగుతుందన్న ఆలోచనతో వారిని సంప్రదించడం లేదు. దీంతో అనుభవించు రాజా అన్నట్టుగా మందులు, చిందులు పెరిగిపోయాయి.

అవి పేరుకు మాత్రమే ఫాంహౌస్‌లు…వ్యవసాయ క్షేత్రాలు. కానీ అక్కడ జరుగుతున్న సేద్యం వేరు. డ్రగ్స్, గంజాయి పండగ చేసుకుంటున్నారు. ఎవరూ అడగరు ఎందుకంటే, ఆ ఫాంహౌస్‌లలో ఎక్కువగా బడాబడా నేతలవే. రాజకీయ అండదండలతో తమ ఫామ్‌హౌస్‌లను అరాచకాలకు కేరాఫ్‌గా మార్చేశారు. రోజుకింత రెంట్ కడితే చాలు…తాగండి, ఊగండి, మీ ఇష్టారాజ్యం అన్నట్టుగా రాసిచ్చేస్తున్నారు. ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న హైదరాబాద్ ఫాంహౌస్‌ అక్రమాలను చూసి జనాల విస్తుపోతున్నారు.
ఫామ్‌హౌసుల్లో అశ్లీల నృత్యాలతో విచ్చలవిడితనం పతాకస్థాయిలో ఊరేగుతుంది. పార్టీలో హుక్కా కామన్ అయిపోయింది. డ్రగ్స్ గురించి చెప్పక్కర్లేదు. గంజాయి అలవోకగా సరఫరా అవుతోంది. పేరుకు ఫాంహౌస్ అని చెప్పుకుని…వీకెండ్‌లో వికారాలతో రెచ్చిపోతున్నారు కొందరు పార్టీ లవర్స్. నగరంలో నిఘా ఎక్కువైందని.. సిటీ శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. డ్రగ్‌ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్‌లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్‌ డే.. గెట్‌ టుగెదర్‌.. వీకెండ్‌ ఔటింగ్‌… అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్‌ తో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రతీ వీకెండ్‌లో రైడ్స్ చేస్తున్న పోలీసులకు, భారీస్థాయిలో అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతోంది. యువకుల దగ్గర పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్‌ పెట్టిన పోలీసులు.. నగర శివారులపైనా దృష్టిపెట్టారు.

బర్త్ డే పార్టీ అయినా, రిసెప్షన్‌నైనా, లేదంటే మరేదైనా కానీ, వీకెండ్‌ వచ్చిందంటే చాలు… సిటీ శివారుల బాట పడుతున్నారు కొందరు యువతీ, యువకులు. ఎంజాయ్‌మెంట్‌ పేరుతో ఫామ్‌ హౌజ్‌లు, రిసార్ట్‌లకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి లిక్కర్‌ పార్టీ చేసుకునేది కొందరైతే… కేవలం డ్రగ్‌ పార్టీలు చేసుకునేందుకు వెళ్తున్న వాళ్లు మరికొందరు. నగరంలో గంజాయి, డ్రగ్స్ ను వెటాడుతున్నాయి ఈగల్‌ టీమ్స్‌. అడుగడుగునా గంజాయి, డ్రగ్స్‌ సరఫరాకు చెక్‌ పెడుతున్నారు. దీంతో… మత్తురాయుళ్లు సిటీ శివారులను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. భారీ విస్తీర్ణం, చుట్టూ కంచె, సెక్యూరిటీ, పచ్చని చెట్లు, ఏం చేసినా, ఎవరికీ అర్థంకాదనే ఆలోచనతో ఫాంహౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. ఇందులో సినిమా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, వారి సుపుత్రులు కూడా అనేకం వున్నారు.

ఫామ్‌హౌసుల్లో జరుగుతున్న అరాచకాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయి. ఫామ్‌హౌస్‌కి డబ్బిచ్చేశాం కాబట్టి.. ఏం చేసినా ఎవరూ అడగటానికి వీల్లేదనే స్థాయిలో రెచ్చిపోతున్నారు పార్టీ లవర్స్. గతంలో పబ్బుల్లో పార్టీలకు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఫామ్‌హౌస్‌ పార్టీలకే ఫుల్‌ క్రేజ్. ఎక్కడ దొరకని ఆనందం, అనుభూతి ఫామ్‌హౌస్‌ పార్టీల్లో సొంతం చేసుకోవచ్చనే ఊహల్లో పార్టీ లవర్స్ తేలిపోతున్నారు. వీరి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటే చాలు రెండు చేతులా సంపాదించుకోవచ్చు. దీంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లాగే.. ఫామ్‌హౌస్‌ పార్టీల మేనేజ్‌మెంట్‌కు కూడా దళారులు పుట్టుకొచ్చారు. వీరికి జస్ట్ డేట్, టైమ్ చెబితే చాలు.. మిగతా అరేంజ్‌మెంట్స్ అన్నీ వారే చూసుకుంటారు. అందుకు తగ్గట్టుగా డబ్బులు తీసుకుంటారు. మొదట్లో స్ట్రెస్ రిలీఫ్‌ అంటూ వీకెండ్‌లో చిన్నస్థాయిలో మొదలైన ఫామ్‌హౌస్‌ పార్టీలు.. తర్వాత ప్రైవసీ, జనావాసాలు తక్కువగా ఉండే వీలును ఉపయోగించుకుని.. వెర్రితలలు వేశాయి. చాలావరకు ఫామ్‌హౌస్‌ యజమానులు, పార్టీల నిర్వాహకులు స్థానిక పోలీసులు, అధికారులకు మామూళ్లు ఇటువైపు కన్నెత్తి చూడకుండా డీల్స్ చేసుకుంటున్నారు. కొంతమంది పోలీసులు తమకు తెలిసిన రైడ్స్ సమాచారం కూడా ముందే చేరవేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా దాడులు జరిగినప్పుడు మాత్రమే ఫామ్‌హౌస్‌ పార్టీల గుట్టు రట్టవుతోంది. ఇలా రట్టయ్యే పార్టీలు మొత్తంగా జరిగే పార్టీల్లో పదోవంతు కూడా కాదనే వాదన లేకపోలేదు. ఫామ్‌ హౌస్‌ పార్టీలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలంటే.. వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందేననే డిమాండ్లు వస్తున్నాయి. అవసరమైతే ఫామ్‌హౌస్‌ల నిర్వహణకు కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించాలనే అభిప్రాయాలున్నాయి.

హైదరాబాద్ శివార్లలో తరచూ ఎక్కడో ఒక చోట రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీల గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ కల్చర్ కి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఫామ్ హౌస్ నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలి, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఫార్మ్ హౌస్, రిసార్ట్ యజమానులు, నిర్వాహకులు తప్పనిసరిగా పార్టీలకు కచ్చితంగా అనుమతులు తీసుకొని ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫామ్ హౌస్, రిసార్ట్ లలో మొత్తం కనిపించేలా సీసి కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఏదైనా పోలీస్ అనుమతులు కావాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని… పోలీసులు ఫార్మ్ హౌస్, రిసార్ట్ లను పరిశీలించినప్పుడు సహకరించాలని చెప్పారు. కుటుంబ అవసరాల కోసం ఫామ్ హౌస్ లు అద్దెకు తీసుకునే వారిపై కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈవెంట్లు, పార్టీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకుండా, డ్రగ్స్, ముజ్రా లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వహకులదేనని అన్నారు.

న్యూడ్​ డ్యాన్సులు, స్పెషల్​గా గేమింగ్​ జోన్స్…ముజ్రా పార్టీలు…లోపలకు ఎవరూ రాకుండా హై సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, బౌన్సర్లు..ఇలా సిటీ శివారు ఫాంహౌస్​లో అమ్మాయిలతో పార్టీలంటేనే యూత్‌కు క్రేజ్ పెరిగింది. అందుకే వారిని ఆకర్షించడానికి​ కొందరు ఆర్గనైజర్లు గర్ల్స్​తో పార్టీలు పెడుతున్నారు. ముంబై, వెస్ట్‌‌ బెంగాల్‌‌, ఏపీ, నార్త్ ఈస్ట్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. క్లబ్స్ తరహాలో సెమీ న్యూడ్‌‌ డ్యాన్సులు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సిటీలో కొన్ని గ్యాంగ్స్‌‌ కూడా పనిచేస్తున్నాయి. వీరు ఆన్‌‌లైన్‌‌ బుకింగ్స్‌‌తో ఫాంహౌస్​లలో ఈవెంట్స్ కాండక్ట్ చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా సాగుతోందని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ, ముజ్రా పార్టీ, ఇలా ఎలాంటి పార్టీ జరుగుతున్నా…సమాచారం అందిన వెంటనే రైడ్స్ చేస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్ నలువైపులా ఫామ్‌హౌస్‌లు వున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 530 ఫాంహౌస్‌లు వున్నాయి. ఒక్క మొయినాబాద్ పీఎస్‌‌లో పరిధిలోనే 500 వరకు ఉన్నాయి. గండిపేట చెరువు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ప్రశాంతంగా వుంటాయి. 111 జీవో కారణంగా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడంపై ఆంక్షలున్నాయి. దీంతో బడాబాములు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌లు నిర్మిచుకున్నారు. ఫాంహౌస్ వుండటం హైదరాబాద్‌లో ఇప్పుడొక స్టేటస్ సింబల్‌గా మారింది. సంపన్నులు, పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలకు ఎగబడీ మరీ కొంటున్నారు. వీకెండ్ అయినా, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షనైనా అందులో నిర్వహిస్తున్నారు. మొయినాబాద్‌‌ పీఎస్‌‌లో పరిధిలో వుండే 500 ఫామ్‌‌హౌసుల్లో 250 వరకు లీజ్‌‌కు ఇచ్చారు. మరో 250 వరకు యజమానులు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. లీజ్‌కు తీసుకున్న కొందరు ఫామ్‌హౌస్‌లను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారన్న ఆరోపణలున్నాయి.

మోకిలా, శంకర్‌‌‌‌పల్లి పీఎస్‌‌ల పరిధిలో దాదాపు 32 ఫామ్‌‌హౌస్‌‌లలో క్రేజీ పార్టీలు జరుగుతుంటాయి. రెంట్ ఎంత ఎక్కువైనా చెల్లించి మరీ పార్టీల కోసం ఎగబడుతుంటారు. ఫామ్‌‌హౌస్‌‌ లోపల ఏం జరుగుతుందన్నది బయటి ప్రపంచానికి తెలియదు. నలువైపులా సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వుంటుంది. పోలీసులు ఎవరైనా వస్తే…వెంటనే సమాచారం చేరిపోతుంది. దీంతో వీకెండ్‌లో చాలామంది వీటి చెంతకు చేరిపోతున్నారు. ఐటీ ఉద్యోగులు, సంపన్నులు, వారి పిల్లలు, సెలబ్రిటీలు, వారి కుటుంబాలు, ఇతర ప్రముఖులు పార్టీలతో ఎంజాయ్​ చేస్తున్నారు. వీరిలో కొందరు డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం, రేవ్ పార్టీల, ముజ్రా పార్టీలతో రెచ్చిపోతున్నారు. దీనికి తోడు డీజే సౌండ్‌తో కలకలం రేపుతున్నారు. పేకాట, క్యాసినో, పోకర్‌‌‌‌ లాంటి నిషేధిత గేమ్స్‌‌ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. టేబుల్స్​వేసి రౌండ్స్‌‌ చొప్పున ఛార్జ్‌‌ వసూలు చేస్తున్నారు. ఆటగాళ్లకు ఫుడ్‌తో పాటు లిక్కర్‌ సర్వ్ చేస్తున్నారు. వ్యభిచారం కూడా జరుగుతోందని పోలీసుల తనిఖీల్లో బయటపడింది.

ఫామ్‌ హౌస్ ఓనర్లు, లీజుకు తీసుకున్నవారు ఫంక్షన్లకు రెంట్‌కి కూడా ఇస్తుంటారు. మెహెందీ, సంగీత్, బర్త్ డే, పెళ్లి వార్షికోత్సవం వంటి వేడుకలకు అద్దెకు ఇస్తుంటారు. శివారుల్లోని కన్వెన్షన్​ కేంద్రాల్లో వేడుకకు రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇక పెళ్లి పందిళ్లు, భోజనాలు, స్నాక్స్​తో కొన్ని కన్వెన్షన్లలో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుంది.అయితే, ఫాంహౌస్​లలో వారం రోజుల పాటు నిర్వహించే వేడుకలకు కేవలం రూ.3.50 లక్షలు మాత్రమే బడ్జెట్ అవుతుండటంతో, చాలామంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. కానీ కొన్ని ఫంక్షన్లలో మాత్రం డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోందని పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా వీకెండ్‌లో సిటీ బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం మొదలైన ఫామ్‌హౌస్ కల్చర్.. చివరకు ఇల్లీగల్ పార్టీ కల్చర్‌కు కేరాఫ్‌ గా మారటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఫామ్‌హౌస్ పార్టీలపై పోలీసులు దాడులు చేస్తున్నా.. కొన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నా.. పార్టీ లవర్స్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పైగా ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్న వారు కూడా కేవలం ఫామ్‌హౌస్‌ పార్టీల కోసం హైదరాబాద్ వచ్చి.. వీకెండ్‌లో రచ్చకు సిద్ధపడటం కలకలం రేపుతోంది. ఈ పోకడను ఇలాగే వదిలేస్తే.. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంా మారుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు.. ఫామ్‌హౌస్‌ పార్టీలు దెబ్బతీయక ముందే సర్కారు వీటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drug parties Hyderabad
  • Farmhouse party crackdown
  • Hyderabad crime hotspots
  • Hyderabad farmhouse parties
  • Illegal activities farmhouses Hyderabad

తాజావార్తలు

  • Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

  • Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన

  • Nandyal Mu*rder: నంద్యాలలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఇలా దొరికిపోయింది..!

  • Ugadi Special: అరగంటలో ఉగాది ప్రసాదాలు.. హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!

  • Parabhava Nama Samvatsaram: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి?.. అర్థం, విశేషాలు, పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions