Site icon NTV Telugu

Zaheer Khan: మూడో మ్యాచ్‌లో అతడ్ని ఆడించండి.. లేదంటే!

Zaheer Khan On Umran Malik

Zaheer Khan On Umran Malik

ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, ఈ సిరీస్‌లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నెగ్గాలంటే, భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత తుది జట్టులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సూచించాడు. ముఖ్యంగా.. ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాడు. అతడు టీమిండియాకు కచ్ఛితంగా ఎక్స్ ప్యాక్టర్‌గా మారుతాడని అభిప్రాయపడ్డాడు.

‘‘తదుపరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ఆడించాలి. అతడి ఎక్స్‌ట్రా పేస్‌ భారత జట్టుకి ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనను మనమంతా చూశాము. ఈ లీగ్‌లో అతడు డేవిడ్‌ మిల్లర్‌ను ఉమ్రాన్‌ అవుట్‌ చేసిన విధానం నిజంగా అమోఘం. వేగవంతమైన బంతి వేసి, మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఉమ్రాన్ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని జహీర్ వెల్లడించాడు. అంతేకాదు.. మూడో మ్యాచ్‌కి వేదిక కానున్న డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం చాలా చిన్నదని, కాబట్టి స్పిన్నర్లు ఒత్తిడిలో కూరుకుపోవచ్చని అన్నాడు. అలాంటప్పుడు ఉమ్రాన్ వంటి పేసర్‌ను తీసుకుంటే బాగుంటుందని జహీర్ పేర్కొన్నాడు. మరి, జహీర్ సూచన మేరకు ఉమ్రాన్‌ని తుది జట్టులో ఎంపిక చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అత్యంత వేగవంతమైన బంతులు వేసి, బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 22 వికెట్లు పడగొట్టి, క్రీడా ప్రముఖుల ప్రశంసలూ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతడ్ని దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు టీమిండియాలో చోటిచ్చారు. అయితే.. మొదటి రెండు మ్యాచ్‌లకు అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

Exit mobile version