NTV Telugu Site icon

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ః భార‌త్‌పై న్యూజిలాండ్ ఘ‌న‌విజ‌యం

ఐసీసీ మొద‌టి వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో టీం ఇండియాపై న్యూజిలాండ్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో టీం ఇండియా విసిరిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కేవం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఈ ఫైన‌ల్స్‌లో భార‌త జ‌ట్టు 139 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌గా, న్యూజిలాండ్ జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది.

Read: తెలకపల్లి రవి : మా ఎన్నికలపోటీలో కొత్త కోణాలు

కెప్టెన్ విలియ‌మ్స్ 52 పరుగులు, రాస్ టేల‌ర్ 47 ప‌రుగులు చేయ‌గా, ఓపెన‌ర్లు టామ్ లాథ‌మ్ 9, దేవాన్ కాన్వె 19 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.  వీరిద్దరూ త‌క్కువ ప‌రుగుల‌కే ఔటైనప్ప‌టికీ, విలియ‌మ్స్, రాస్ టేల‌ర్‌లు నిదానంగా అడుతూ వికెట్ కోల్పోకుండా విజ‌యాన్ని అందించారు.  భార‌త జ‌ట్టులో అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్వాలేద‌నిపించాడు.