Site icon NTV Telugu

రెజ్లర్‌ ”గ్రేట్ కాళి” ఇంట విషాదం…

WWE ఫేమ్ రెజ్లర్ కాళి ఇంట విషాదం నెలకొంది. కాళి తల్లి దలీప్ సింగ్ రాణా అనారోగ్యంతో మరణిచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్‌మౌర్‌ జిల్లా ధిరానియా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్‌.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం ఉపయోగించుకుని.. ది గ్రేట్‌ కాళి పేరుతో రెజ్లింగ్‌ కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు పంజాబ్​ పోలీసాఫీసర్​గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్​ కొనసాగించాడు. ఈ ఏడాది WWE నుంచి ‘హాల్ ఆఫ్​ ఫేమ్’​ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి.

Exit mobile version