Women’s World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి, అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?
భారత్ విజయానికి జెమిమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) సెంచరీతో కాంతినింపగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ జంట 180కి పైగా పరుగుల భాగస్వామ్యం కట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ బాదగా, ఎలీస్ పెర్రీ (77) అర్ధశతకంతో రాణించింది. చివర్లో ఆష్లీన్ గార్డ్‌నర్ (63) దూకుడుగా ఆడినా, భారత బౌలర్ల ఆఖరి దెబ్బలతో ఆసీస్ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి మెరుపులు మెరిపించగా, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ చెరో వికెట్ సాధించారు. నవంబర్ 2న ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
iQOO Neo 11: iQOO నుంచి మరో కొత్త ఫోన్.. 7500mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?
