Site icon NTV Telugu

ఒలింపిక్స్‌లో నేడు మహిళల హాకీ సెమీఫైనల్‌

Hockey

Hockey

భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్‌ హాకీలో…క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో…ఆస్ట్రేలియాను ఓడించి…సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్‌ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి…సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన.ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో రాణి రాంపాల్ సేన తలపడనుంది. అందులో గెలిస్తే.. ఇక మహిళ హాకీ చరిత్ర మలుపు తిరగడం ఖాయం!పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో…మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయ్. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి…ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఒకవైపు స్ట్రైకర్లు, మరోవైపు డిఫెన్స్ టీం అద్భుతంగా రాణించడంతో భారత్ గెలుపును… ఎవరు ఆపలేరని విశ్లేషకులు చెబుతున్నారు. క్వార్టర్‌ ఫైనల్‌లో ట్రిపుల్ ఒలింపిక్స్‌ విజేతనే ఓడించడంతో…పతకంపై ఆశలు పెంచింది రాణి రాంపాల్‌ టీమ్.

Exit mobile version