NTV Telugu Site icon

Ravi Shastri : ధోనీపై రవిశాస్త్రి సీరియస్.. ఆ ఓటమిని తట్టుకోలేక!

Whatsapp Image 2023 01 23 At 082030 1674442723147 1674442723380 1674442723380

Whatsapp Image 2023 01 23 At 082030 1674442723147 1674442723380 1674442723380

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ధోనీపై సీరియస్ అయ్యాడట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన తాజా బుక్ ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్‌’లో రాశాడు. ఇందులో ఇప్పటి వరకూ క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. ధోనీపై అప్పటి కోచ్ రవిశాస్త్రి సీరియస్ అవడం కూడా ఇందులో ఒకటి. 2018లో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందట. తొలి వన్డేలో 8 వికెట్లతో ఇండియా గెలిచినా.. తర్వాతి మ్యాచ్‌లో 86 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ పోరులో మహీ కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేసిన తీరు కోచ్ రవిశాస్త్రికి నచ్చలేదని శ్రీధర్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, రైనా క్రీజులో ఉన్నంత వరకూ ఆశలు ఉన్నా.. తర్వాత వెంటవెంటనే ఈ ఇద్దరితోపాటు హార్దిక్ కూడా ఔటవడం ఇండియా ఓటమికి కారణమైంది.

Tollywood: వైజాగ్ లో తెలుగు నటుడి ఆత్మహత్య!

“టీమిండియా విజయానికి 66 బంతుల్లో 133 రన్స్ అవసరం. టెయిలెండర్లతో కలిసి ధోనీ క్రీజులో ఉన్నాడు. అయితే అతడు మాత్రం విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించకుండా నెమ్మదిగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లోనే ధోనీ వన్డేల్లో 10 వేల రన్స్ కూడా పూర్తిచేసుకున్నాడు. అయితే చివరికి అతడు 59 బంతుల్లో కేవలం 37 రన్స్ చేసి 47వ ఓవర్లో ఔటయ్యాడు. ఇదే రవిశాస్త్రికి కోపం తెప్పించింది. 86 రన్స్‌తో ఓడిపోయినందుకు కాదు కానీ.. కనీసం పోరాడకుండానే చేతులెత్తేయడం అతనికి నచ్చలేదు. అందుకే మూడో వన్డేకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో మీటింగ్ పెట్టాడు. అప్పుడు నేరుగా ధోనీ కళ్లలోకి చూస్తూ రవి ఇలా చెప్పాడు. ‘మీరు ఎవరైనా సరే.. గెలవడానికి ప్రయత్నించకుండా మరో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి మళ్లీ రాకూడదు. నా కోచింగ్‌లో ఇలాంటిది జరగకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. కానీ ఇలా మాత్రం ఓడకూడదు” అని రవిశాస్త్రి అన్నట్లు శ్రీధర్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.