Site icon NTV Telugu

Kieron Pollard: అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై

Kieron Pollard

Kieron Pollard

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం విండీస్ జట్టుకు వన్డే కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్ 15 ఏళ్లుగా తన దేశానికి ఆడుతున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. విండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తన జీవితంలో మరపురాని అనుభూతిగా పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా టీ20, టీ10 లీగ్‌లకు అందుబాటులోనే ఉంటానని తెలిపాడు. అయితే ఐపీఎల్ జరుగుతున్న వేళ పొలార్డ్ తన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో 123 వన్డేలు ఆడిన పొలార్డ్‌ 2,706 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో 101 మ్యాచ్‌లు ఆడి 1,569 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కెరీర్‌లో ఒక్క టెస్టు కూడా పొలార్డ్ ఆడలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్నాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో పొలార్డ్ 16 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 87గా ఉంది.

IPL 2022: చెత్తగా ఓడిన పంజాబ్.. ఢిల్లీకి ముచ్చటగా మూడో విజయం

Exit mobile version