కోహ్లీ కూతురుకు అత్యాచార బెదిరింపులు.. ఆ పని చేసినందుకేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ గారాల పట్టీ వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ ఓడిపోవడానికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీయే కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ఆగ్రహంతో మహ్మద్ షమీ కుటుంబ సభ్యులను వేధించారు. అయితే మ్యాచ్ విషయంలో పలువురు క్రికెటర్లు షమీకి సపోర్ట్ గా నిలిచారు. ముస్లిం అని వేరుచేసి, కులాలు, మతాలు కలిపి దూషించడం నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ సైతం షమీకి ఎప్పుడు అండగా ఉంటామని తెలిపాడు. వెన్నుముక లేనివారే కులమతాలను తీసుకొచ్చి దూషిస్తారని తెలిపాడు. దీంతో శమికి సపోర్ట్ గా విరాట్ నుండడం నచ్చని కొందరు అతని కూతురు వామికను టార్గెట్ చేశారు. ఇలాగె వారిని సపోర్ట్ చేస్తే చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ పోస్ట్ లు పెట్టారు.
తాజాగా ఈ పోస్ట్ లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఆ పోస్ట్ పెట్టినట్లు తెలుసుకున్నారు. అది ఫేక్ అకౌంట్ అని తెలిసింది. ” విరాట్ కుమార్తెపై వచ్చిన బెదిరింపులు నా వద్దకు వచ్చాయి. ప్రజలందరూ ఇది ఒక ఆట మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. మేమందరం వేరువేరు దేశాల తరుపున ఆడుతున్నా ఆటగాళ్లు అందరు ఒక్కటే. విమర్శిస్తే విరాట్ ఆటని విమర్శించండి.. అంతేకాని వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయంపై తెలుగు సింగర్ చిన్మయి కూడా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ ట్వీట్స్ ని పోస్ట్ చేస్తూ తనదైన రీతిలో ఏకిపారేసింది.
Also Read
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- Tags
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?