Site icon NTV Telugu

కోహ్లీ కూతురుకు అత్యాచార బెదిరింపులు.. ఆ పని చేసినందుకేనా..?

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ గారాల పట్టీ వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ ఓడిపోవడానికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీయే కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ఆగ్రహంతో మహ్మద్ షమీ కుటుంబ సభ్యులను వేధించారు. అయితే మ్యాచ్ విషయంలో పలువురు క్రికెటర్లు షమీకి సపోర్ట్ గా నిలిచారు. ముస్లిం అని వేరుచేసి, కులాలు, మతాలు కలిపి దూషించడం నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ సైతం షమీకి ఎప్పుడు అండగా ఉంటామని తెలిపాడు. వెన్నుముక లేనివారే కులమతాలను తీసుకొచ్చి దూషిస్తారని తెలిపాడు. దీంతో శమికి సపోర్ట్ గా విరాట్ నుండడం నచ్చని కొందరు అతని కూతురు వామికను టార్గెట్ చేశారు. ఇలాగె వారిని సపోర్ట్ చేస్తే చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ పోస్ట్ లు పెట్టారు.

తాజాగా ఈ పోస్ట్ లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఆ పోస్ట్ పెట్టినట్లు తెలుసుకున్నారు. అది ఫేక్ అకౌంట్ అని తెలిసింది. ” విరాట్ కుమార్తెపై వచ్చిన బెదిరింపులు నా వద్దకు వచ్చాయి. ప్రజలందరూ ఇది ఒక ఆట మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. మేమందరం వేరువేరు దేశాల తరుపున ఆడుతున్నా ఆటగాళ్లు అందరు ఒక్కటే. విమర్శిస్తే విరాట్ ఆటని విమర్శించండి.. అంతేకాని వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయంపై తెలుగు సింగర్ చిన్మయి కూడా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ ట్వీట్స్ ని పోస్ట్ చేస్తూ తనదైన రీతిలో ఏకిపారేసింది.

Exit mobile version