Site icon NTV Telugu

Virat Kohli: ఫామ్‌లేమిపై వస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్

Virat Kohli Counter On Crit

Virat Kohli Counter On Crit

Virat Kohli Strong Counter On Criticism: కొన్నాళ్ల నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై ఏ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయో అందరికీ తెలిసిందే! కోహ్లీ నిరాశపరిచిన ప్రతీసారి అతని ఫామ్ గురించి చర్చలు ప్రారంభమవుతాయి. జట్టులో నుంచి తీసేయాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతాయి. అయితే.. వీటిపై కోహ్లీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. తోటి ఆటగాళ్లు, కొందరు మాజీలు మద్దతుగా నిలిచారు కానీ.. ఈ రన్ మెషీన్ మౌనం పాటిస్తూ వచ్చాడు.

ఇన్నాళ్ల తర్వాత ఆ మౌనాన్ని విడిచి.. తనపై వస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చాడు విరాట్ కోహ్లీ. అది కూడా స్వయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఒక ఫోటోలోని కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేడు కింద పడితే ఏంటి.. కానీ డార్లింగ్, నువ్వు పైకి ఎగిరితే?’’ అనే కోట్ రాసి ఉన్న ఫోటోని కోహ్లీ షేర్ చేస్తూ.. తన ఫామ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. దీంతో.. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. విమర్శకులకు కౌంటర్‌గా ఈ ట్వీట్ ఉందంటూ అందరూ చెప్పుకుంటున్నారు.

కాగా.. 2019 నవంబర్ 22వ తేదీ నుంచి విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మెరిపించాడు కానీ, అవి అతని స్థాయి ఇన్నింగ్స్ అయితే కాదు. చాలాసార్లు నిరాశపరిచిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీపై వ్యతిరేకులు ముప్పేట దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కోహ్లీ చేసిన తాజా ట్వీట్ సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది.

Virat Kohli Tweet:

Exit mobile version