Virat Kohli Fans Fire On Naveen Ul Haq: మే 1వ తేదీన ఎల్ఎస్‌జీపై ఆర్సీబీ విజయం నమోదు చేసిన తర్వాత నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ.. ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. రానురాను ఇది మరింత ముదురుతోంది. సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై మరొకరు పరోక్షంగా కౌంటర్లు వేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పతనంపై వరుసగా ఇన్‌స్టాలో సెటైర్లు వేయగా.. ఇప్పుడు నవీన్ ముంబై చేతిలో ఆర్సీబీ పతనంపై విరాట్ కోహ్లీని రెచ్చగొట్టేలా కౌంటర్లు వేశాడు. తొలుత విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ అయినప్పుడు.. మామిడి పండ్లు తింటున్న ఫోటోని షేర్ చేసి ‘మ్యాంగోస్ తియ్యగా ఉన్నాయ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. అనంతరం.. సూర్య, నేహాల్ ఆర్సీబీ ఓటమిని ఖరారు చేసే క్రమంలో వారిద్దరి ఫోటోలను షేర్ చేసి.. ‘‘రౌండ్ 2, ఇంతటి తియ్యటి మామిడి పండ్లను ఎప్పుడూ తినలేదు, సూపర్’’ అంటూ మరో ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.
Good News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పెరిగిన హెచ్‌ఆర్‌ఏ
ఈ రెండు స్టోరీలు చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. నవీన్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మా కింగ్‌తో పెట్టుకుంటే నీకు దబిడి దిబిడే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్.. జాగ్రత్త’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు నువ్వెంత? నీ అనుభవం ఎంత? కోహ్లీనే అనేంత తోపువా? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముందు నీ ఆట గురించి నువ్వు చూసుకో అని, ఆ తర్వాత ఇతరులపై రాళ్లు వేద్దువంటూ నవీన్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా.. నవీన్‌కు తలపొగరు ఎక్కువ అని చెప్పడానికి గతంలోనే కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అతడు ఇంతకుముందే కొందరు సీనియర్ ఆటగాళ్లతో మైదానంలో గొడవ పడ్డాడు. మహ్మద్ ఆమిర్, షాహిద్ ఆఫ్రిది వంటి ముదుర్లతో కూడా పేచీలు పెట్టుకున్న ఘనత అతనిది. అసలు అతనికి ఏం చూసుకొని అంత పొగరో మరి! ఇలాగే అందరితో గొడవ పడితే.. అతని కెరీర్ తప్పకుండా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
PM Modi: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులపై మెతక వైఖరి అవలంభిస్తోంది.