Virat Kohli Breaks Sachin Tendulkar Record: గతేడాది ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. అప్పటినుంచి దుమ్ముదులిపేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అఫ్‌కోర్స్.. కొన్ని మ్యాచెస్‌లో ఫెయిల్ అయ్యాడు కానీ, ఫామ్‌ని మాత్రం నిలకడగా కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్‌దాకా వెళ్లిందంటే.. అది కోహ్లీ వల్లేనని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనూ అదరగొడుతున్నాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. ఇప్పుడు మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించాడు. అంతేకాదు.. సెంచరీ చేశాక లంక బౌలర్లపై తాండవం చేశాడు. ఫలితంగా.. 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి.
Delhi Crime: ఢిల్లీలో హత్య చిత్రీకరణ.. 37 సెకన్ల వీడియోను పాకిస్థాన్‌కు పంపి..
ఈ శతకంతో కోహ్లీ ఒక అరుదైన ఘనత సాధించాడు. మాస్టర్ బ్లాక్‌బస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. స్వదేశంలో కోహ్లీకి ఇది 21వ సెంచరీ. దీంతో.. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ సచిన్ పేరిట ఉండేది. ఆయన స్వదేశంలో 20 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పుడు కోహ్లీ 21వ సెంచరీలతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. మొత్తం వన్డే క్రికెట్‌లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. ఇకో మూడు సెంచరీలు సాధిస్తే.. సచిన్ (49) రికార్డ్‌ని సమం చేస్తాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో చూస్తే.. కోహ్లీకి ఇది 74వ అంతర్జాతీయ శతకం. మరో విశేషం ఏమిటంటే.. ఈ సెంచరీతో కలిపి శ్రీలంకపై కోహ్లీ మొత్తం 10 సెంచరీలు చేశాడు. తద్వారా ద్వీపవాసులపై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
KA Paul: పవన్.. రాజకీయాల నుంచి తప్పుకో లేదా నా పార్టీలో చేరు