Site icon NTV Telugu

WPL2024: పోరాడి ఓడిన UP వారియర్జ్..దీప్తి శర్మ ఒంటరి పోరాటం వృధా ..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో UP వారియర్జ్ మరియు గుజరాత్ జెయింట్స్ మధ్య బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.ఈ మ్యాచ్‌లో  తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌కి ఓపెనర్స్ దగ్గర నుంచి గుడ్ స్టార్ట్ లభించింది.కెప్టెన్‌ బెత్‌ మూనీ వీరోచిత ఇన్నింగ్స్ తో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ బెత్‌ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించగా, లారా వాల్‌వార్ట్‌ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. వారియర్జ్‌ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్‌ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ దూరం!

153 పరుగులు లక్ష ఛేదనతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వారియర్జ్‌కి “షబ్నమ్‌” తాను వేసిన మొదటి ఓవర్ లోనే కెప్టెన్ అలెక్స్ హీలీ,ఓనెడౌన్ బాట్స్మన్ చమరి అతపత్తును పెవిలిన్ కి పంపింది. ఆదిలోనే తడబడిన వారియర్జ్‌కి దీప్తి శర్మ(60బంతుల్లో 88: 9ఫోర్లు , 4సిక్సస్ )ఒంటరి పోరాటంతో రాణించినా వారియర్జ్‌ ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో వారియర్జ్‌ 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్‌ ఖేమ్నర్‌ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్‌ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

Also Read:Vadakkupatti Ramasamy : ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఈక ఇ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది.ఒకవేళ గుజరాత్ ప్లే ఆప్స్ కి చేరుకోవాలి అంటే ఆర్సీబీ , up వారియర్జ్‌ మిగిలిన మ్యాచ్స్ లో ఓడిపోవాలి అలానే గుజరాత్ అత్యధిక నెట్ రన్ రేట్ తో గెలవలిసి ఉంటుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్‌ రేసులో ముందుంజలో ఉంది.

Exit mobile version