క్రికెటర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సహజమే! కాకపోతే.. దాని వెనుక బలమైన కారణం ఉండాలి. చీటికి మాటికి సిల్లీ కంప్లైంట్స్ ఇస్తే మాత్రం.. కచ్ఛితంగా కోపంతో రగిలిపోతారు. స్టువర్ట్ బ్రాడ్ విషయంలో అదే చోటు చేసుకుంది. పదే పదే ఫిర్యాదు చేస్తుండడంతో.. కోపాద్రిక్తుడైన అంపైర్ నోర్మూసుకొని బ్యాట్ చేసుకో అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఈ సంఘటన భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆటలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టువర్ట్ బ్రాడ్‌ను భారత బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమ షార్ట్ డెలివరీలతో బాగా ఇబ్బంది పెట్టారు. అతడ్ని ఆడనివ్వలేదు. దీంతో, అతడు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అది కూడా ఒకసారి కాదు.. చాలాసార్లు. దీంతో అంపైర్‌కి కోపమొచ్చింది. అంతే.. ‘‘నన్ను అంపైరింగ్ చేసుకోనివ్వు.. నువ్వు నీ బ్యాటింగ్ చేసుకో.. లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు.. ‘‘ఒక్క ఓవర్‌కే ఇలా చేస్తే ఎలా? నువ్వు బ్యాటింగ్ చెయ్, అలాగే కాస్త నోరు మూసుకో’’ అంటూ అంపైర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలావుండగా.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 బంతులే ఎదుర్కొన్న బ్రాడ్, ఒకే ఒక్క పరుగు తీసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు కూడా స్టువర్ట్‌కి ఓ చేదు అనుభవం ఎదురైంది. అదే.. ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకోవడం. జస్‌ప్రీట్ బుమ్రా అతని బౌలింగ్‌లో ఎడాపెడా వాయించడంతో.. 35 పరుగులు వచ్చాయి. దీంతో.. టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డ్‌ను బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Richard Kettleborough#FromYorkshire pic.twitter.com/SIIczXE4UQ
— Sɪʀ Fʀᴇᴅ Bᴏʏᴄᴏᴛᴛ (@SirFredBoycott) July 4, 2022