NTV Telugu Site icon

ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్

West Indies Out Of World Cu

West Indies Out Of World Cu

Two Time Champions West Indies Fail To Qualify For 2023 World Cup: ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే.. ఇతర జట్లకు దడ పుట్టేది. రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ (1975, 1979) విజేతగా నిలిచిన విండీస్ జట్టుతో తలపడాలంటే.. ఇతర జట్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కానీ.. రానురాను ఆ జట్టు డీలా పడుతూ వచ్చింది. చెప్పుకోవడానికి ఈ జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు కానీ, అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ప్రతీసారి పరాభావాలే చవిచూస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ జట్టుకి ఘోర అవమానం ఎదురైంది. కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. పసికూన స్కాట్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడి.. అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకప్పుడు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన విండీస్‌ జట్టు.. స్కాట్లాండ్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలై, అభిమానుల ఆశల్ని నీరుగారుస్తూ వెనుదిరిగింది. వెస్టిండీస్‌ నిష్క్రమణతో.. సూపర్‌ సిక్సెస్‌లో జింబాబ్వే, శ్రీలంక జట్లకు టాప్‌-10లో నిలిచేందుకు మార్గం సుగమమైంది.

Devulapalli Amar: టీడీపీ 20 ఏళ్లు పాలించినా.. ఎందుకు ఇంకా పేదరికం ఉంది?

కాగా.. వన్డే ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు టీమిండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ 8 జట్లతో పాటు.. క్వాలిఫయర్స్‌లో సూపర్‌ సిక్సెస్‌ దశలో టాప్‌-2లో నిలిచే రెండు జట్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో అడుగుపెడతాయి. ఇందుకోసం.. జింబాబ్వే వేదికగా శ్రీలంక, వెస్టిండీస్‌తో పాటు అసోసియేట్‌ దేశాలు పడ్డాయి. ఈ పోటీల్లో భాగంగా.. గ్రూప్‌- ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ జట్లు.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు సూపర్ సిక్స్‌కి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒమన్‌ను జింబాబ్వే, నెదర్లాండ్స్‌ను శ్రీలంక ఓడించి.. వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు అర్హత సాధించేందుకు ముందడుగు వేశాయి. రన్ రేట్ పరంగా విండీస్ వెనుకపడి ఉండటంతో.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. తొలి మ్యాచ్‌లోనే ఈ జట్టు స్కాట్లాంట్‌ వంటి పసికూన చేతిలో చిత్తుగా ఓడి, ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీన్ని బట్టి.. విండీస్ జట్టు ఆటతీరు ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Humanity: మానవత్వం చూపిన పోలీసులు.. చిన్నారిని లాలించిన మహిళ కానిస్టేబుల్..!

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ బౌలింగ్‌ ఎంపిక చేసుకోవడంతో, బ్యాటింగ్ చేసేందుకు వెస్టిండీస్ రంగంలోకి దిగింది. ఒక్క జేసన్ హోల్డర్ (45) మినహాయించి.. మిగతా బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో, వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ క్రాస్‌ (74 నాటౌట్), బ్యాటర్‌ బ్రాండన్‌ మెక్‌ములెన్‌ (69) అద్భుతంగా రాణించడంతో.. స్కాట్లాంట్ విజయాన్ని సొంతం చేసుకుంది.