Site icon NTV Telugu

‘డియర్ కామ్రేడ్’ సినిమా రిపీట్.. మహిళా అథ్లెట్ ను గదిలోకి లాక్కెళ్లి

Coach

Coach

కొన్ని సినిమాలు నిజ జీవితాలను చూసి ప్రేరణ పొందుతాయి అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక ఘటన కూడా సినిమానే తలపిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గుర్తు ఉండే ఉంటుంది.. మహిళా క్రికెటర్ అవ్వాలనుకున్న రష్మికను ఆమె కోచ్ లైంగికంగా వేధించి బయటికి పంపించేస్తాడు.. ఆ దారుణమైన ఘటనతో ఆమె మానసికంగ కృంగిపోయి ఆటకు దూరమవుతుంది.. చివరకు హీరో సహాయంతో అతడి గురించిన నిజాన్ని బయటపెట్టి మళ్లీ ఆటలో చేరుతుంది. తాజాగా ఇదే కథ స్లోవేనియా లో జరిగింది.. ఒక భారత సైక్లిస్ట్‌ తన కోచ్ లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందు బాహాటంగా చెప్పడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్‌ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్‌ వెళ్లారు. అక్కడ మహిళలకు ఎటువంటి కోచ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉండరు. దీంతో పురుషులకు కోచ్ గా ఉన్న ఆర్‌కే శర్మ మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఇక ఈ నేపథ్యంలోనే అతడు, ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.. గదిలోకి వచ్చి తన భార్యగా ఉండాలని, తనతో ఏకాంతంగా గడపాలని కోరుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై మహిళా సైక్లిస్ట్‌ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనం రేపడంతో ఆమెను పోటీలో పాల్గొనకముందే ఇండియా తిరిగి రావాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 14 న పోటీలు ఉండగా.. ఆమె అందులో పాల్గొనకుండానే ఇండియా చేరుకుంది. ఇక మహిళా సైక్లిస్ట్‌ ఫిర్యాదును నమోదు చేసుకున్న స్పోర్ట్స్ అధికారులు విచారణ చేపట్టారు. నిజానిజాలు అన్ని ఏబయటికి తెస్తామని, కోచ్ తప్పు కనుక ఉంటే అతడిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినఆర్‌కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version