Site icon NTV Telugu

నేటితో ముగియనున్న టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలు సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమవనున్నాయి. బాణాసంచా వెలుగు జిలుగులు, జపాన్‌ పాప్‌ సంగీతం కనువిందు చేయనుంది. ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్నారు. ప్యారీస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌ గురించి ఒక పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ముగింపు వేడుకలు ముగిస్తాయి.

Exit mobile version